పెళ్లాం వదిలేయడంతో తాగుడుకు బానిసయ్యా: యుజ్వేంద్ర చాహల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం మద్యానికి బానిసైనట్లు టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. విడాకులు, సమాజం నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యానని చెప్పాడు. కరోనా లాక్డౌన్ సమయంలో డ్యాన్స్ నేర్చుకునేందుకు ధనశ్రీకి దగ్గరైన చాహల్.. ఆమెపై మనసుపారేసుకొని మనువాడాడు.
అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ రోజులు కొనసాగలేదు. మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో గతేడాది ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ధనశ్రీ దూరమైన తర్వాత చాహల్ తాగుబోతుగా మారాడు. నడవలేని స్థితిలో తాగి తూగుతూ ఉన్న అతని వీడియోలు నెట్టింట వైలర్‌గా మారాయి. రిహాబిలిటేషన్ తీసుకొని ఎట్టకేలకు ఈ సమస్య నుంచి బయటపడిన చాహల్.. తిరిగి క్రికెట్‌పై ఫోకస్ పెట్టాడు.

నరకం అనుభవించా..
తాజాగా ఆకాష్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తనకు ఇష్టమైన క్రికెట్‌కు దూరమవుతున్నానే విషయాన్ని గ్రహించే మద్యాన్ని వదిలేసానని చెప్పాడు. 'యుక్త వయసులో మద్యం తాగడం అలవాటైంది. నా విడాకుల తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. మానసికంగా తీవ్రంగా కుంగిపోయా.
విడాకుల అనంతరం నరకంలా అనిపించింది. యాంగ్జైటీ, పానిక్ అటాక్స్‌తో ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడలేకపోయాను. కానీ నా తాగుడు వల్ల నాకెంతో ఇష్టమైన క్రికెట్ దూరమవుతుందని గ్రహించా. వెంటనే రిహాబ్ సెంటర్‌ను ఆశ్రయించడంతో ఈ వ్యసనం నుంచి బయటపడగలిగా. మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టా.'అని చాహల్ చెప్పుకొచ్చాడు.
నన్ను వేలాడదీసింది సైమండ్స్ కాదు..
ఐపీఎల్ 2013 సీజన్ సందర్భంగా ఓ ఆస్ట్రేలియా క్రికెటర్ పీకలదాక మద్యం తాగి తనను బాల్కానీ నుంచి తలకిందులుగా వేలాడదీసాడని గతంలో చాహల్ చెప్పాడు. అందరూ అనుకున్నట్లు తనను వేలాడదీసింది సైమండ్స్, జేమ్స్ ఫ్రాంక్లీన్ కాదని చెప్పుకొచ్చాడు. 'బెంగళూరులో ఆర్సీబీ ఆ పార్టీ నిర్వహించింది. ఆ సమయంలో నేను ముంబై ఇండియన్స్ తరఫున తొలి సీజన్ ఆడుతున్నాను. పీకలదాక మద్యం తాగిన ఆటగాడు ఎవరా? అని వెళ్లి చూశాను. అతను చాలా ధృడంగా ఉన్నాడు. కానీ అతను సైమండ్స్, ఫ్లాంక్లీన్ కాదు. మరో ఆసీస్ ఆటగాడు.
అతను నన్ను పిలిచి గాల్లోకి తలకిందులుగా వేలాడదీసాడు. ముందుగా అతను జోక్ చేస్తున్నాడనుకున్నా. కానీ నిజంగానే బాల్కానీలోకి తీసుకెళ్లి వేలాడదీసాడు. నేను అతని మెడను గట్టిగా పట్టుకున్నాను. ఆ ఘటనను తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుడుతుంది. ఇది చూసి అక్కడ ఉన్నవారు స్టన్ అయ్యారు. వెంటనే జోక్యం చేసుకొని నన్ను వెనక్కి లాగారు. అతను మాత్రం బిగ్గరగా నవ్వాడు. నాకు మాత్రం పునర్జన్మలా అనిపించింది. హోటల్ 15, 16వ అంతస్థులో ఇది జరిగింది.'అని చాహల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


