రిటైర్మెంట్ ప్రకటించిన యుజ్వేంద్ర చాహల్!
టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రెడ్ బాల్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. కౌంటీ క్రికెట్‌లో భాగంగా లార్డ్స్‌లో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అనంతరం చాహల్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
దాంతో భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాలనే చాహల్ కలలకు అధికారికంగా తెరపడినట్లయింది. వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం రీఎంట్రీ కోసం తన ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేశాడు.
నా కల నెరవేరకుండానే..
'భారత్ తరఫున టెస్ట్ క్యాప్ అందుకోవడం నా కెరీర్ లో అతిపెద్ద కల. కానీ ఇకపై అది నెరవేరకపోవచ్చు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు సాగిన నా ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. రెడ్ బాల్ క్రికెట్ అనేది ఓ ఫార్మాట్ మాత్రమే కాదు. ఆటగాళ్లకు ఓపిక, క్యారెక్టర్, మైదానంలో కొన్ని గంటల పాటు శ్రమించడంలో ఉన్న అసలైన సంతోషాన్ని తెలియజేస్తుంది.'అని చాహల్ చెప్పుకొచ్చాడు.

హర్యానా తరఫున 2009లో చాహల్ ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు. తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 32.27 యావరేజ్‌తో 148 వికెట్లు నేలకూల్చాడు. కౌంటీ క్రికెట్‌లో ఇంగ్లండ్ నార్తాంప్టన్‌షైర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన చాహల్.. అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కౌంటీ చాంపియన్‌షిన్-2లో 6 మ్యాచ్‌ల్లోనే 16.14 సగటుతో 21 వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. లార్డ్స్ లో మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్ చాహల్ కెరీర్‌లో చివరి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌గా నిలిచింది.
బ్యాటింగ్ సామర్థ్యం లేకపోవడంతో..
టీమిండియా టెస్ట్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు సుదీర్ఘ కాలం సత్తా చాటడంతో చాహల్‌కు అవకాశం లేకుండా పోయింది. పైగా ఈ ఇద్దరికి బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటంతో చాహల్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి కూడా తీసుకోలేదు. చాహల్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం చాలా రోజుల క్రితమే మానేసాడు.
చివరగా 2016-17 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన అతను 33 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున చాహల్ 72 వన్డేలు, 80 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్న చాహల్.. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బ్యాటింగ్ చేసే సామర్థ్యం లేకపోవడంతో అద్భుతమైన బౌలర్ అయినప్పటికీ చాహల్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


