Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: బరిలో వైభవ్ సూర్యవంశీ.. పాకిస్థాన్‌తో ఫైనల్ ఆడే భారత తుది జట్టు ఇదే!

ఆసియా గేమ్స్‌ 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు తుది పోరుకు సిద్దమైంది. శనివారం దాయాదీ పాకిస్థాన్‌తో జరిగే స్వర్ణ పోరులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 124 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. అదే జోరులో పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.

Asian Games 2026: విలువిద్యలో భారత్‌కు నాలుగో స్వర్ణం.. 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!

Asian Games 2026: విలువిద్యలో భారత్‌కు నాలుగో స్వర్ణం.. 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!

జపాన్‌లోని నిషిన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10.30 గంటలకు మొదలవ్వనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం కారణంగా క్వార్టర్ ఫైనల్స్ రద్దయిన సంగతి తెలిసిందే. భారత్-శ్రీలంక సెమీఫైనల్ సజావుగానే సాగినా.. పాక్-బంగ్లా సెమీఫైనల్‌కు అంతరాయం కలిగింది. ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ రద్దయితే మెరుగైన ర్యాంక్ కలిగిన భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు.

India Playing XI vs Pakistan Vaibhav Sooryavanshi to Open Jasprit Bumrah Named as Only Pacer

ఓపెనర్‌గా వైభవ్..

పాకిస్థాన్‌తో పోల్చితే భారత జట్టే హాట్ ఫేవరేట్. కానీ దాయాదీని తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఈ క్రమంలోనే టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందనేది? ఆసక్తికరంగా మారింది. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో సీనియర్ ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు దారుణంగా విఫలమవ్వగా.. వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

అంతేకాకుండా టీమిండియా విభిన్నమైన కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. ఎక్స్‌ట్రా బ్యాటర్‌‌గా వైభవ్‌ను ఆడించి ఏకైక పేసర్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను ఆడించింది. జపాన్‌లో పూర్తి స్పిన్ కండిషన్స్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కాంబినేషన్ మంచి ఫలితాన్ని ఇవ్వడంతో ఫైనల్లో కూడా ఇదే కొనసాగించనుంది.

భారత్ X పాక్ ఫైనల్ మ్యాచ్.. షేక్ హ్యాండ్ ఉంటుందా..?

Also Read

భారత్ X పాక్ ఫైనల్ మ్యాచ్.. షేక్ హ్యాండ్ ఉంటుందా..?

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేయనుండగా.. సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్లుగా ఆడనుండగా.. జస్‌ప్రీత్ బుమ్రా ఏకైక పేసర్‌గా బాధ్యతలు పంచుకోనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబే బరిలోకి దిగనున్నాడు. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్ బెంచ్‌కే పరిమితం కానున్నారు.

శ్రీలంకతో సెమీఫైనల్ ఆడే భారత తుది జట్టు(అంచనా)

వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా

ఆసియా గేమ్స్ 2026కు ఎంపికైన భారత జట్టు

సంజూ శాంసన్/వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్.

Story first published: Friday, October 2, 2026, 11:45 [IST]
Other articles published on Oct 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+