Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్.. డబుల్ రోల్!

టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కోచ్‌గా నయా ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. అప్‌కమింగ్ ఐపీఎల్ 2027 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అసిస్టెంట్ కమ్ బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలందించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది.

ఇప్పటికే మెంటార్‌గా అభిషేక్ శర్మ వంటి పలువురు ఆటగాళ్లను తీర్చిదిద్దిన యువరాజ్ సింగ్.. అధికారికంగా కోచింగ్ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. గతంలో ఇదే ఫ్రాంచైజీకి(ఢిల్లీ డేర్‌డేవిల్) ఆడిన యువరాజ్ సింగ్.. ఇప్పుడు కోచ్‌గా సేవలందించనున్నాడు.

ఐపీఎల్ 2015 సీజన్‌లో అప్పటి ఢిల్లీ డేర్‌డేవిల్స్ యువరాజ్ సింగ్‌ను రూ.16 కోట్ల రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ ధర పలికిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ నిలిచాడు. ఆ సీజన్‌లో ఢిల్లీ తరఫున యువీ 14 మ్యాచ్‌లూ ఆడాడు. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ నియమితులైన సంగతి తెలిసిందే.

Yuvraj Singh Joins Delhi Capitals Coaching Setup as Batting Coach and Assistant Ahead of IPL 2027

కోచింగ్ అంటే నాకు చాలా ఇష్టం..

ఢిల్లీ అసిస్టెంట్ కమ్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంపై యువరాజ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఢిల్లీ క్యాపిటల్స్‌తో నా జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫ్రాంచైజీతో నాకు పాత అనుబంధం ఉంది. మేనేజ్‌మెంట్ కూడా బాగా తెలుసు. ఇది నాకు దక్కిన గొప్ప అవకాశం.

హెడ్ కోచ్‌ 'దాదా' (సౌరవ్ గంగూలీ)తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కోచింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిభావంతులతో కూడిన ఈ జట్టుతో పనిచేయడానికి నేను సిద్దంగా ఉన్నాను. ఈ ప్రయాణం నాకు ఉత్తేజకరంగా ఉంటుందని, జట్టు విజయానికి నా వంతు కృషి చేస్తానని విశ్వసిస్తున్నాను.'అని తెలిపాడు.

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

యువీకి స్వాగతం..

యువరాజ్ సింగ్ నియామకంపై ఢిల్లీ క్యాపిటల్స్ ఛైర్మన్, సహ యజమాని పార్థ్ జిందాల్ సంతోషం వ్యక్తం చేశాడు. 'యువరాజ్ సింగ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబంలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. భారత క్రికెట్‌లోని గొప్ప మ్యాచ్ విన్నర్లలో ఆయన ఒకరు. ఎంతోమంది యువ ప్రతిభావంతులను తీర్చిదిద్దారు. ఆయన అనుభవం, గెలుపు తత్వం, ఆటగాళ్లతో కలిసిపోయే నైజం మా జట్టుకు కలిసొస్తాయి.'అని తెలిపారు.

మరో సహ యజమాని కిరణ్ కుమార్ గ్రంధి సైతం యువరాజ్ సింగ్ నియామకంపై హర్షం వ్యక్తం చేశాడు.'యువరాజ్ సింగ్‌ను మా కోచింగ్ టీమ్‌లోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అతని అద్భుతమైన కెరీర్, పోటీతత్వం, ఆటపై ఉన్న లోతైన అవగాహన మా కోచింగ్ టీమ్‌కు గొప్ప బలాన్నిస్తాయి.'అని పేర్కొన్నారు.

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

Also Read

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

టీమిండియా 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన రికార్డ్ కూడా యూవీ పేరిటనే ఉంది. తన ఐపీఎల్ కెరీర్‌లో 132 మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ సింగ్.. 2,750 పరుగులు చేసి 36 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Wednesday, October 14, 2026, 11:14 [IST]
Other articles published on Oct 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+