IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ వెస్టిండీస్ నాలుగో టీ20కి ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ నగరం సిద్దమైంది. బుధవారం(అక్టోబర్ 14) ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) పెద్దలతో పాటు పోలీసు అధికారులు తెలిపారు.
ఈ మ్యాచ్ నేపథ్యంలో సోమవారం హెచ్‌సీఏ, హైదరాబాద్ పోలీస్ అధికారులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. పూర్తిగా పోలీస్ నిఘాలో ఈ మ్యాచ్ జరుగుతుందని మల్కాజ్‌గిరి సీపీ సుమతి వెల్లడించారు. ఈ మ్యాచ్ కోసం 2200 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

స్టేడియం చుట్టూ 4 వాచ్ టీమ్స్ ఉంటాయని, 408 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో అనుక్షణం పర్యవేక్షిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో ఫేక్ టికెట్లపై కూడా నిఘా పెట్టామని చెప్పారు. ఇప్పటికే ఫేక్ టికెట్ లింక్‌లపై జనాలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
ఈ మ్యాచ్‌కు 40 వేల మంది అభిమానులు వచ్చే అవకాశం ఉందని, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశామని చెప్పారు. సుమారు 8 వేల వాహనాలు పట్టేలా పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు. ఇరు దేశాల ఆటగాళ్లు బంజారాహిల్స్ నుంచి స్టేడియానికి వస్తారని, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 8 షీ టీమ్స్‌ను మఫ్టీలో ఉంచుతామని తెలిపారు.
మ్యాచ్ కు వచ్చే వాళ్లు ఆర్‌టీసీ, మెట్రో వంటి ప్రజా రవాణ సదుపాయలను ఉపయోగించూకోవాలని సీపీ సుమతి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. మ్యాచ్‌కు 2 గంటలే ముందే ప్రేక్షకులకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించి 25 వేల టికెట్లు ఆన్‌లైన్ వేదికగా విక్రయాలు జరిగాయని, మిగతా టికెట్లను ఈ రోజు సాయంత్రం ఆల్‌లైన్ వేదికగానే విక్రయిస్తామని హెచ్‌సీఏ అధికారులు తెలిపారు. మైదానంలో ప్రేక్షకుల కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని చెప్పారు. బ్లాక్ మార్కెట్‌లో టికెట్ విక్రయాలు జరిగితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


