IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ గెలిచి.. ఆఖరి మ్యాచ్‌లో వైభవ్‌ను ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
ఈ ఐదు టీ20ల సిరీస్‌లో రెండు గెలిచి ఒకటి ఓడిన టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా బుధవారం నాలుగో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది. అయితే తొలి మూడు టీ20ల్లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కలేదు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లనే కొనసాగించడంతో వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

వైభవ్‌ను ఆడించాలి..
ఈ క్రమంలోనే హైదరాబాద్ మ్యాచ్ గెలిచి ఆఖరి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని అభిషేక్ నాయర్ అభిప్రాయపడ్డాడు. 'భారత్ ముందు 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకోవాలి. ఆ తర్వాత ఆఖరి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి.'అని పేర్కొన్నాడు.
తొలి రెండు టీ20ల్లో విఫలమైన అభిషేక్ శర్మ మూడో టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో తనను ఇబ్బంది పెట్టిన రోస్టన్ ఛేజ్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన అభిషేక్ నాయర్.. అభిషేక్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు.
అభిషేక్ గొప్పతనమే అది..
'ప్రత్యర్థి బౌలర్ వ్యూహాన్ని అర్థం చేసుకుంటూ ఆడటం అభిషేక్ శర్మ ప్రత్యేకత. తొలి రెండు టీ20ల్లో తనను ఔట్ చేసిన రోస్టన్ ఛేజ్‌ను అభిషేక్ శర్మ అద్భుతంగా ఎదుర్కొన్నాడు. అతని బౌలింగ్‌ను ఓపికగా ఆడటం అభిషేక్ శర్మ గొప్పతనం. క్రీజులో కాసేపు నిలదొక్కుకోవడం అంటే.. బౌలర్‌ను ఎలా దెబ్బతీయాలనే ప్లాన్ చేసుకోవడమే.
బ్యాటర్ ఆడే ప్రతీ బంతికీ బౌలర్ ఏం ఆలోచిస్తున్నాడనే విషయం అర్థమవుతుంది. అభిషేక్ శర్మ తొలి 6 బంతులు జాగ్రత్తగా ఆడేసరికి, బౌలర్ రోస్టన్ ఛేజ్ అతని వెనుక పడాల్సి వచ్చింది. అభిషేక్‌కు ఉన్న హిట్టింగ్ ఇమేజ్ చూసి ఛేజ్ కూడా భయపడి బౌలింగ్ చేశాడు. ఆ 6 బంతులు ఆడాక.. బౌలర్ ఏం వేస్తాడో బ్యాటర్‌కు ఒక అంచనా వచ్చేస్తుంది.
ఇక్కడ ఒకరిపై ఒకరు గెలిచేందుకు మైండ్ గేమ్ నడుస్తుంది. అభిషేక్ శర్మను ఛేజ్ గతంలో రెండుసార్లు ఔట్ చేసి ఉండొచ్చు. కానీ అభిషేక్ శర్మ ఆ కొన్ని బంతులు తట్టుకుని నిలబడేసరికి, ఒక ఆఫ్ స్పిన్నర్‌గా తాను వేసే వైవిధ్యమైన బంతులన్నీ వాడేశాడు. దాంతో అభిషేక్ శర్మ తర్వాతి బంతికి బౌలర్ ఏం చేస్తాడో ముందే పసిగట్టాడు. అభిషేక్ శర్మ ప్రత్యేకతే ఇది. తొలి బంతి నుంచే బాదగలడు. అవసరమైతే కాసేపు టైమ్ తీసుకుని బౌలర్‌ను ఒత్తిడిలోకి నెట్టగలడు.'అని అభిషేక్ నాయర్ కొనియాడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
