శభాష్ అభిషేక్.. నీపై విసిరిన రాళ్లను మైలురాళ్లుగా మార్చుకున్నావ్: యువరాజ్ సింగ్
అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన అభిషేక్ శర్మను మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో ప్రశంసించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిషేక్ శర్మ ఫొటోను షేర్ చేసిన యువరాజ్ సింగ్.. వినూత్నంగా అభినందనలు తెలియజేశాడు. బద్దలయ్యే మరెన్నో రికార్డులకు ఇది ఆరంభం మాత్రమేనని రాసుకొచ్చాడు. తనపై విసిరిన రాళ్లను మైలురాళ్లుగా మార్చుకున్నాడని కొనియాడాడు.
శభాష్.. అభిషేక్
'టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన సర్ అభిషేక్ శర్మకు హృదయపూర్వక అభినందనలు. నీకున్న ప్రతిభకు.. నువ్వు పడే కష్టానికి ఏదో ఒకరోజు ఈ రికార్డు సాధిస్తావని నాకు ముందే తెలుసు. ఇది మున్ముందు బద్దలయ్యే మరెన్నో రికార్డులకు ఆరంభం మాత్రమే.

'జనాలు నీపై రాళ్లు విసిరినప్పుడు.. వాటినే మైలురాళ్లుగా మార్చుకో.. మాటలతో కాకుండా నీ బ్యాట్‌తోనే సమాధానం చెప్పు.'అని ఒక మహానుభావుడు ఒకసారి అన్నాడు. నువ్వు సరిగ్గా అదే చేస్తున్నావ్! శభాష్. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎప్పుడూ ఇలాగే ఒదిగి ఉంటూ.. నీ ప్రాసెస్ నువ్వు ఫాలో అవుతూ ఉండు.'అని యువరాజ్ సింగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
యువరాజ్ సింగ్ సలహాతోనే..
యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకాన్ని నమోదు చేశానని మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ తెలిపాడు. 'రెండో టీ20 అనంతరం మా గురువు యువరాజ్ సింగ్ నాకు ఒక టెక్ట్స్ మెసేజ్ పంపాడు. అందులో అన్ని బంతులను బలంగా కొట్టడానికి ప్రయత్నించవద్దని, బంతి బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్ కానప్పుడు ఒకటి లేదా రెండు సింగిల్స్ తీసుకొని ప్రశాంతంగా ఉండాలని సలహా ఇచ్చాడు. తొందరపడకుండా ఎక్కువసేపు మైదానంలో ఉండాలని సూచించాడు. అతను చెప్పినట్లుగానే చేశాను.'అని అభిషేక్ శర్మ వెల్లడించాడు.
30 బంతుల్లోనే శతకం..
గురువారం ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ(34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 108) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. బౌండరీల ద్వారానే 102 పరుగులు రాబట్టిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన టెస్ట్ నేషన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ(35 బంతుల్లో సెంచరీ) రికార్డ్‌ను అధిగమించాడు. అభిషేక్ శర్మ విధ్వంసంతో ఈ మ్యాచ్‌తో టీమిండియా 127 పరుగుల భారీ తేడాతో గెలుపొంది.. సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


