IND vs AFG: అభిషేక్ శర్మ ఊచకోత.. బౌండరీలతోనే సెంచరీ!
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన టెస్ట్ నేషన్ బ్యాటర్‌గా నిలిచాడు. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఆకాశమే హద్దు సిక్సర్లు బాదిన అభిషేక్ శర్మ.. బౌలర్లను ఊచకోత కోసాడు. ఈ క్రమంలో 30 బంతుల్లోనే 10 సిక్స్‌లు, 9 ఫోర్ల సాయంతో ఫాస్టెస్ట్ శతకాన్ని నమోదు చేశాడు.
బౌండరీలతోనే సెంచరీ..
ఆ తర్వాత మరో భారీ సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ.. 34 బంతుల్లో 9 ఫోర్లు 11 సిక్స్‌లతో 108 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇందులో బౌండరీల ద్వారానే 102 పరుగులు చేశాడు. కెరీర్‌లో అభిషేక్ శర్మకు ఇది మూడో టీ20 సెంచరీ కాగా.. వినూత్న రీతిలో సెలెబ్రేట్ చేసుకున్నాడు. టేస్ట్ హోదా కలిగిన దేశాల్లో ఇదే ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు.
ఈ క్రమంలో రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డ్‌ను కూడా అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ రికార్డ్ హిట్ మ్యాన్ పేరిట ఉండేది. 2017లో ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు.

అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు..
27 బంతుల్లో - సాహిల్ చౌహాన్ (ఎస్టోనియా) vs సైప్రస్, ఎపిస్కోపి, 2024
29 బంతుల్లో - మహమ్మద్ ఫహద్ (టర్కీ) vs బల్గేరియా, సోఫియా, 2025
30 బంతుల్లో - అభిషేక్ శర్మ (భారత్) vs అఫ్గానిస్తాన్, ఢిల్లీ, 2026
33 బంతుల్లో - జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ (నమీబియా) vs నేపాల్, కీర్తీపూర్, 2024
33 బంతుల్లో - సికందర్ రజా (జింబాబ్వే) vs గాంబియా, నైరోబి (రుఅరాకా), 2024
33 బంతుల్లో - ఫిన్ అలెన్ (దక్షిణాఫ్రికా) vs న్యూజిలాండ్, కోల్‌కతా, 2026
అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు..(పూర్తి స్థాయి ఐసీసీ సభ్యత్వ జట్లు ):
30 బంతుల్లో - అభిషేక్ శర్మ (భారత్) vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ, 2026
33 బంతుల్లో - సికందర్ రజా (జింబాబ్వే) vs గాంబియా, నైరోబి (రుఅరాకా), 2024
33 బంతుల్లో - ఫిన్ అలెన్ (దక్షిణాఫ్రికా) vs న్యూజిలాండ్, కోల్‌కతా, 2026
35 బంతుల్లో - డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) vs బంగ్లాదేశ్, పోచెఫ్‌స్ట్రూమ్, 2017
35 బంతుల్లో - రోహిత్ శర్మ (భారత్) vs శ్రీలంక, ఇండోర్, 2017
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


