Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 108) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. బౌండరీల ద్వారానే 102 పరుగులు చేసిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన టెస్ట్ నేషన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ(35 బంతుల్లో సెంచరీ) రికార్డ్‌ను అధిగమించాడు. అభిషేక్ శర్మ విధ్వంసంతో ఈ మ్యాచ్‌తో టీమిండియా 127 పరుగుల భారీ తేడాతో గెలుపొంది.. సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

కఠినమైన పిచ్‌పై అభిషేక్ బ్యాటింగ్ అమోఘం: శ్రేయస్ అయ్యర్

కఠినమైన పిచ్‌పై అభిషేక్ బ్యాటింగ్ అమోఘం: శ్రేయస్ అయ్యర్

ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన అభిషేక్ శర్మ.. యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ భారీ ఇన్నింగ్స్ ఆడగలిగానని తెలిపాడు. 'రెండో టీ20 అనంతరం మా గురువు యువరాజ్ సింగ్ నాకు ఒక టెక్ట్స్ మెసేజ్ పంపాడు. అందులో అన్న బంతులను బలంగా కొట్టడానికి ప్రయత్నించవద్దని, బంతి బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్ కానప్పుడు ఒకటి లేదా రెండు సింగిల్స్ తీసుకొని ప్రశాంతంగా ఉండాలని సలహా ఇచ్చాడు. తొందరపడకుండా ఎక్కువసేపు మైదానంలో ఉండాలని సూచించాడు. అతను చెప్పినట్లుగానే చేశాను.'అని అభిషేక్ శర్మ వెల్లడించాడు.

Abhishek Sharma Reveals Yuvraj Singh s Advice Behind His Record 30-Ball T20I Century

ఈ సిరీస్‌కు ముందు ఏడు ఇన్నింగ్స్‌ల్లో అర్ధశతకం సాధించడంలో విఫలమైన అభిషేక్ శర్మా.. నాలుగు సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. దాంతో సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ నుంచి ఒత్తిడిని కూడా ఎదుర్కొన్నాడు.

కానీ యువరాజ్ సింగ్ సలహాను పాటింటి.. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. 11 సిక్స్‌లు, 9 ఫోర్ల సాయంతో 30 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఈ మూడు టీ20ల సిరీస్‌లో అభిషేక్ శర్మ 82, 39, 108 పరుగులు చేసి.. 3 మ్యాచ్‌ల్లో మొత్తం 229 పరుగులు సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 221 పరుగులు చేసింది. సంజూ శాంసన్(35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(2/37) రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ ఇద్దరి వల్లే ఈ విధ్వంసకర సెంచరీ: అభిషేక్ శర్మ

Also Read

ఆ ఇద్దరి వల్లే ఈ విధ్వంసకర సెంచరీ: అభిషేక్ శర్మ

అనంతరం అఫ్గానిస్థాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్(16 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 25) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి(3/25), రవి బిష్ణోయ్(3/26) మూడేసి వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించారు. జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్‌కు చెరో వికెట్ దక్కింది.

Story first published: Friday, September 18, 2026, 15:19 [IST]
Other articles published on Sep 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+