న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిజం మాట్లాడితే పిచ్చోడు అంటారు.. అలానే కెప్టెన్సీ కోల్పోయా: పాక్ మాజీ క్రికెటర్

 Younis Khan opens up on losing Pakistans captaincy

కరాచీ: పాకిస్థాన్ జట్టులో అత్యంత విజయవంతమైమన కెప్టెన్లలో యూనిస్ ఖాన్ ఒకడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఆ దేశ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తర్వాత ప్రపంచకప్ అందించిన కెప్టెన్ యూనిస్ ఖానే.అతని సారథ్యంలోనే పాకిస్థాన్ 2009 టీ20 వరల్డ్‌కప్ గెలుచుకుంది. కానీ ఆ టోర్నీ ముగిసిన ఆరు నెలల వ్యవధిలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యూనిస్‌ ఖాన్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. అయితే దీనికి గల కారణాన్ని తాజాగా యూనిస్ ఖాన్ వెల్లడించాడు. గల్ఫ్ న్యూస్‌కు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పటి జట్టులో రాజకీయాలపై గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి నిజాయతీగా చెప్పడమే తాను చేసిన తప్పు అని ఈ మాజీ క్రికెటర్ వెల్లడించాడు.

 నేను చేసిన పెద్ద తప్పు..

నేను చేసిన పెద్ద తప్పు..

‘నిజాలు మాట్లాడితే జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం సహజం. ఇంకా చెప్పాలంటే పిచ్చోడిగా చూస్తారు. నేను చేసిన పెద్ద తప్పు.. జట్టులోని కొంత మంది క్రికెటర్లు పాక్ తరఫున నిజాయతీగా మ్యాచ్‌లు ఆడటం లేదని చెప్పడమే. అప్పట్లో జట్టులోని రాజకీయాల కారణంగా కొంత మంది ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే ఔటైపోయేవారు. నేను ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆ క్రికెటర్లు నాతో కలిసి మ్యాచ్‌లు ఆడారు. అయితే.. వారు చేసిన తప్పునకు ఆ తర్వాత పశ్చాతాపం వ్యక్తం చేశారు. నిజాలు చెప్పడం, నిజాయతీగా ఉండటాన్ని నా తండ్రి నుంచి నేను నేర్చుకున్నా. ఎప్పుడూ నిజాలు మాట్లాడుతూ నిజాయితీగా ఉంటా''అని యూనిస్ ఖాన్ వెల్లడించాడు.

భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కన్నుమూత

యూనిస్ ఖాన్‌కు వ్యతిరేకంగా కుట్ర..

యూనిస్ ఖాన్‌కు వ్యతిరేకంగా కుట్ర..

ఇటీవల పాక్ మాజీ పేసర్ రాణా నవీద్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. న్యూజిలాండ్ జరిగిన ఓ సిరీస్‌లో యూనిస్ ఖాన్‌కు వ్యతిరేకంగా కొంతమంది సీనియర్ ఆటగాళ్లు కుట్ర పన్నారని తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘2009లో న్యూజిలాండ్‌తో జరిగిన ఓ సిరీస్‌లో రెండు వన్డేల్లో మేము ఓడిపోయాం. దానికి కారణం టీమ్‌లోని కొంత మంది క్రికెటర్లు కావలని ఔటవ్వడమే.'అని వెల్లడించాడు. టెస్టుల్లో 10,099 పరుగులు చేసిన యూనిస్ ఖాన్.. ఆ దేశం తరఫున సంప్రదాయక ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఇక వన్డేల్లో 7249 పరుగులు చేసిన ఈ మాజీ కెప్టెన్.. ఓవరాల్‌గా 41 సెంచరీలతో 2017లో అంతర్జాతీయ క్రికెట్‌‌కు గుడ్‌బై చెప్పాడు.

కోహ్లీ, రోహిత్‌కు అది మేలు చేసింది

కోహ్లీ, రోహిత్‌కు అది మేలు చేసింది

ఇక కెరీర్‌ తొలినాళ్లలో సచిన్‌ టెండూల్కర్‌ వంటి దిగ్గజ ఆటగాడు జట్టులో ఉండటం టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మలకు బాగా ఉపకరించిందని యూనిస్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌కు ముందు అతడు ఎలా సిద్ధమవుతాడు, 30, 40 స్కోర్లను ఎలా శతకాలుగా మారుస్తాడు అనే విషయాలను దగ్గరగా చూసే చాన్స్‌ వారికి దక్కిందని ఈ పాక్ మాజీ కెప్టెన్ చెప్పాడు.‘భారత క్రికెట్‌ను పరిశీలిస్తే.. విరాట్‌, రోహిత్‌ కెరీర్‌ ఆరంభించిన సమయంలో సచిన్‌ జట్టులో ఉన్నాడు. టెండూల్కర్‌ లాంటి ఆటగాడు ప్రత్యేకంగా ఏం నేర్పాల్సిన అవసరం లేదు. కేవలం అతడిని చూసే చాలా నేర్చుకోవచ్చు' అని యూనిస్‌ ఖాన్‌ తెలిపాడు.

బీసీసీఐ, ఐసీసీల మధ్య ట్యాక్స్ వార్.. ఒప్పందాలు రద్దు చేసుకుంటామని వార్నింగ్!

Story first published: Monday, May 25, 2020, 13:03 [IST]
Other articles published on May 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X