హమిల్టన్ గ్రౌండ్ నేను నిద్రపోయే బెడ్‌లాంటిది: టేలర్

హమిల్టన్: కోహ్లీ సేన జైత్రయాత్రకు న్యూజిలాండ్ బ్రేక్‌లు వేసింది. సొంతగడ్డపై జరిగిన 5 టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ అయి చేజార్చుకున్న కివీస్.. వన్డేల్లో మాత్రం అదరగొట్టింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టను ఓడించింది. 348 పరుగుల భారీ స్కోర్ నిర్ధేశించినా అలవోకగా ఛేదించి తమ సత్తా ఏంటో కోహ్లీసేనకు తెలియజేసింది.

ముందే అనుకున్నాం..
ఈ మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన టేలర్‌కు మ్యాన్‌ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఈ సందర్భంగా టేలర్ మాట్లాడుతూ.. హమిల్టన్ గ్రౌండ్ తనకు నిద్రపోయే బెడ్‌లాంటిదని, భారత్‌ను 350 పరుగులలోపు కట్టడి చేస్తే విజయం తమదేనని ముందే అనుకున్నామని తెలిపాడు.
‘నిజంగా ఇది రసవత్తకరమైన వేసివకాలం. విజయంతో రేసులో నిలవడం బాగుంది. భారత్‌ను 350లోపు కట్టడి చేస్తే తమకు విజయవకాశాలు ఉంటాయని భావించాం. లెప్ట్, రైట్ కాంబినేషన్ కలిగి ఉండటం మా అదృష్టం. చిన్న బౌండరీలే లక్ష్యంగా చెలరేగాం. టామ్ నా ఒత్తిడిని తగ్గించాడు. హమిల్టన్ గ్రౌండ్ నేను పడుకునే బెడ్‌లాంటిదని నా సహచరులకు చెప్పా. దీనికి సౌతీ ఈ బెడ్‌ను తీసుకెళ్లు. కానీ హ్యాంగోవర్ కాకుండా ప్రయత్నించమన్నాడు. మొత్తానికి వియంతో ముగించడం బాగుంది.'అని టేలర్ తెలిపాడు.
పానీపూరి అమ్మినోడు.. పాక్‌ను పాతరేశాడు

మా కోసం టేలర్ మళ్లీ చెలరేగుతాడు...
ఇక ఈ విజయం పట్ల కివీస్ తాత్కలిక కెప్టెన్ టామ్ లాథమ్ సంతోషం వ్యక్తం చేశాడు. సెంచరీతో రాణించిన టేలర్‌ను కొనియాడాడు. ‘మా జట్టు నుంచి గొప్ప ప్రదర్శన. చాలా రోజుల తర్వాత విజయాన్నందుకోవడం బాగుంది. ఇక టేలర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పడం మా విజయానికి కలిసొచ్చింది. సంతోషంగా కూడా ఉంది. ఇక టేలర్ అద్భుతంగా ఆడాడు. అతను మా జట్టు మళ్లీ మళ్లీ రాణిస్తాడు.'అని టామ్ ప్రశంసించాడు.
అందుకే అంబటి రాయుడిపై వేటు.. చాలా బాధపడ్డా : ఎమ్మెస్కే

అయ్యర్ సెంచరీ వృథా..
ఇక ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్(109 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ 4 వికెట్లతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ (107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో తొలి సెంచరీతో సాధించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 63 బంతుల్లో 6 ఫోర్లు), లోకేష్ రాహుల్ (88 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిసారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. గ్రాండ్ హోమ్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు.
అనంతరం 348 పరుగులతో దిగిన కివీస్.. 48.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసి విజయాన్నందుకుంది. టేలర్ అజేయ సెంచరీకి తోడు నికోలస్(78), స్టాండ్ కెప్టెన్ టామ్ లాథమ్(69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. షమీ, ఠాకుర్ చెరొక వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications