IND vs NZ: యశస్వి జైస్వాల్ భారీ శతకం.. డ్రాగా ముగిసిన మ్యాచ్!
టీమిండియా టెస్ట్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో అనధికారిక టెస్ట్ సిరీస్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన ఈ ముంబై ఆటగాడు.. నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ శతకంతో చెలరేగాడు. దాంతో క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ డ్రాగా ముగిసింది.
98 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-ఏ ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి 52.4 ఓవర్లలో 2 వికెట్లకు 282 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(162 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్‌లతో 155 నాటౌట్), యశ్ రాథోడ్(122 బంతుల్లో 9 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ శతకాలతో రాణించారు. యశ్ రాథోడ్ శతకం పూర్తిగా కాగానే.. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. దాంతో కొన్ని ఓవర్లు ఉండగానే ఈ మ్యాచ్ ముగిసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 102.4 ఓవర్లలో 346 పరుగులు చేసింది. కెప్టెన్ ధ్రువ్ జురెల్(171 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీతో రాణించగా.. దేవదత్ పడిక్కల్(140 బంతుల్లో 12 ఫోర్లతో 80), ఆకాష్ దీప్(116 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
అనంతరం న్యూజిలాండ్-ఏ తొలి ఇన్నింగ్స్ 424 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాథ్యూ బోలే(152 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌తో 110) సెంచరీతో సత్తా చాటగా.. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్(226 బంతుల్లో 9 ఫోర్లతో 93) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్(5/87) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(4/118) నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


