Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ వన్డే సిరీస్ టైమింగ్స్‌లో మార్పులు.. ఎలా చూడాలంటే?

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా మరో కీలక సమరానికి సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు ఐదు వన్డేల సిరీస్‌కు రెడీ అయ్యింది. బుధవారం అక్లాండ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ ఐదు వన్డేల సిరీస్‌కు తెరలేవనుంది.

టీ20 సిరీస్ తరహాలోనే వన్డేల్లోనూ శుభారంభం చేయాలనే పట్టుదలతో భారత్ ఉండగా.. హోమ్ కండిషన్స్‌ను అడ్వాంటేజ్‌గా మార్చుకొని విజయం సాధించాలనే న్యూజిలాండ్ భావిస్తోంది. వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ‌లతో పాటు వన్డే స్పెషలిస్ట్‌లు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌లు బరిలోకి దిగుతుండటంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

IND vs NZ: న్యూజిలాండ్‌ ఓపెనర్ తలకు తీవ్ర గాయం.. భారత్‌తో తొలి వన్డేకు దూరం!

IND vs NZ: న్యూజిలాండ్‌ ఓపెనర్ తలకు తీవ్ర గాయం.. భారత్‌తో తొలి వన్డేకు దూరం!

టైమింగ్స్‌లో మార్పులు..

అయితే వన్డే సిరీస్ టైమింగ్స్‌లో మార్పులు ఉన్నాయి. టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 మొదలైతే.. వన్డేలు తెల్లవారు జామున 7.30కు మొదలవ్వనున్నాయి. భారత అభిమానులు లేచే సరికే మ్యాచ్‌ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. టెస్ట్ మ్యాచ్‌లు అయితే తెల్లవారు జామున 3.30 గంటలకు మొదలవుతాయి.

India vs New Zealand ODI Series 2026 Full Schedule Match Timings Squads and Live Streaming Details

మ్యాచ్‌లు ఎలా చూడాలంటే..?

న్యూజిలాండ్ పర్యటనలోని మ్యాచ్‌లకు సోనీ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. టీ20, వన్డే సిరీస్‌లతో పాటు టెస్ట్ మ్యాచ్‌లు కూడా సోనీ నెట్‌వర్క్ ఛానెల్స్‌తో పాటు సోనీ లివ్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. అయితే ఈ వేదికలుగా మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. మొబైల్ యూజర్లు ప్రత్యేకమైన రిచార్జ్ ప్లాన్స్‌తో సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు.

లేదంటే Airtel Xstream Play, జియో టీవీ వేదికలుగా మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. అయితే ప్రత్యేక రిచార్జ్ ప్లాన్స్‌తో ఈ వేదికల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. లేదంటే ఈ వేదికలను సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది.

India vs New Zealand వన్డే సిరీస్ షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభం)

తొలి వన్డే: నవంబర్ 4, అక్లాండ్

రెండో వన్డే: నవంబర్ 7, వెల్లింగ్టన్

మూడో వన్డే: నవంబర్ 10, హమిల్టన్

నాలుగో వన్డే: నవంబర్ 13, మౌంట్ మాంగాని

ఐదో వన్డే: నవంబర్ 15, మౌంట్ మాంగాని

ICC World Cup 2027 టికెట్లకు ఫుల్‌డిమాండ్.. భారత్ X పాక్ మ్యాచ్‌కు 83 లక్షల దరఖాస్తులు!

Also Read

ICC World Cup 2027 టికెట్లకు ఫుల్‌డిమాండ్.. భారత్ X పాక్ మ్యాచ్‌కు 83 లక్షల దరఖాస్తులు!

తొలి మూడు వన్డేలకు భారత్ జట్టు:

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి(తొలి వన్డేకు మాత్రమే), ఆకిబ్ నబీ

చివరి రెండు వన్డేలకు భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్ర, మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.

Story first published: Tuesday, November 3, 2026, 12:01 [IST]
Other articles published on Nov 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+