IND vs NZ: న్యూజిలాండ్ ఓపెనర్ తలకు తీవ్ర గాయం.. భారత్‌తో తొలి వన్డేకు దూరం!
భారత్‌తో ఐదు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే తలకు తీవ్ర గాయమైంది. దాంతో అతను బుధవారం జరిగే తొలి వన్డేకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో మంగళవారం న్యూజిలాండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫీల్డింగ్ సెషన్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో కాన్వే, పేసర్ మాట్ హెన్సీ ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకున్నారు.
దాంతో డేవాన్ కాన్వే తలకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి స్కాన్ చేయగా.. తలకు గాయమైనట్లు తేలింది. దాంతో భారత్‌తో జరిగే తొలి వన్డే మ్యాచ్‌కు క్వానే దూరమయ్యాడు. అతని స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ టీమ్ సీఫెర్ట్ జట్టులోకి వచ్చాడు.

ఇప్పటికే భుజ గాయంతో రచిన్ రవీంద్ర, కండరాల గాయంతో మార్క్ చాప్‌మన్, విలియం రూర్టిర్కీ, బెన్ సియర్స్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో వన్డే సిరీస్‌కు దూరం కాగా.. ఇప్పుడు కాన్వే ఈ జాబితాలో చేరాడు. ఈ ఏడాది జనవరిలో భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో చివరిసారిగా ఆడిన కాన్వే.. మళ్లీ మరో వన్డే మ్యాచ్ ఆడలేదు. టెస్ట్‌ల్లో మాత్రం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.
ఇప్పటి వరకు 43 వన్డేలు ఆడిన కాన్వే 1692 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలతో పాటు 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అనుభవ కలిగిన కాన్వే దూరం కావడం న్యూజిలాండ్‌కు ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7.30 గంటలకు తొలి వన్డే ప్రారంభం కానుంది. మరోవైపు మ్యాట్ హెన్రీ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని న్యూజిలాండ్ మెడికల్ టీమ్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
డెవాన్ కాన్వే గాయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ విచారం వ్యక్తం చేశాడు. ఇది దురదృష్టకర ఘటన అని పేర్కొన్నాడు. తలకు తగిలిన గాయాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పాడు. మిచెల్ సాంట్నర్ స్థానంలో టీమ్ సీఫెర్ట్ బరిలోకి దిగుతాడని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


