Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: అసిత ఫెర్నాండోతో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు భారీ ఊరట!

టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు భారీ ఊరట లభించింది. శ్రీలంక ప్లేయర్ అసిత ఫెర్నాండోతో గొడవ పడిన ఘటనలో ఐసీసీ జరిమానాతో సరిపెట్టింది. యశస్వి జైస్వాల్‌తో పాటు అసిత ఫెర్నాండో మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.

ఈ ఘటనలో యశస్వి జైస్వాల్‌దే తప్పంటూ మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు తీర్పు ఇచ్చారు. దాంతో యశస్వి జైస్వాల్‌‌‌పై నిషేధం పడుతుందని అంతా అనుకున్నారు. కానీ మ్యాచ్ రిఫరీ లెవెల్-1 నేరంగా పరిగణించి రూల్స్ ప్రకారం చర్యలు తీసుకున్నారు.

IND vs SL: వాడు ఏం అన్నాడో తెలియకపోతే మూసుకో.. హర్షా భోగ్లే‌పై జైస్వాల్ ఫైర్!

IND vs SL: వాడు ఏం అన్నాడో తెలియకపోతే మూసుకో.. హర్షా భోగ్లే‌పై జైస్వాల్ ఫైర్!

ఈ చర్యలకు సంబంధించి ఐసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. 'ఆదివారం కొలంబో వేదికగా మొదలైన రెండో టెస్ట్‌ తొలి రోజున ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్ 1 రూల్‌ను ఉల్లంఘించిన శ్రీలంక పేసర్ అసితా ఫెర్నాండో, భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ల మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. ఆర్టికల్ 2.12 ప్రకారం ఒక ప్లేయర్, సపోర్ట్ స్టాఫ్, అంపైర్‌తో భౌతిక ఘర్షణకు దిగడం నేరం.

Yashasvi Jaiswal and Asitha Fernando Punished By ICC After Heated Exchange in India-Sri Lanka 2nd Test

మ్యాచ్ ఫీజు కోతతో పాటు చెరో డీ మెరిట్ పాయింట్ కేటాయించారు. తమ తప్పులను ఫెర్నాండో, జైస్వాల్ అంగీకరించారు. దాంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే ఈ శిక్షలు ఖరారు చేస్తున్నాం. లెవెల్ 1 ఉల్లంఘనకు పాల్పడినప్పుడు కనీస శిక్షగా హెచ్చరిక, గరిష్టంగా ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50 శాతం, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్స్ ఉంటాయి.'అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.

కొలంబో వేదికగా ఆదివారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అసిత ఫెర్నాండో వేసిన ఒకే ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత ఫెర్నాండో ఒక అద్భుతమైన డెలివరీతో జైస్వాల్‌ను 45 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ తీసిన అనంతరం ఫెర్నాండో అత్యుత్సాహంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను ఏదో మాట అన్నాడు.

IND vs SL: ధోనీ రికార్డ్ బద్దలు కొట్టిన రిషభ్ పంత్.. తొలి వికెట్ కీపర్‌గా..!

Also Read

IND vs SL: ధోనీ రికార్డ్ బద్దలు కొట్టిన రిషభ్ పంత్.. తొలి వికెట్ కీపర్‌గా..!

అది విన్న జైస్వాల్ ఆగ్రహంతో అతనిపైకి దూసుకెళ్లాడు. ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి నోరుపారేసుకున్నారు. ఈ క్రమంలో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండో నుదుటికి తాకింది. దాంతో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండీస్ జోక్యం చేసుకొని ఇద్దర్నీ విడదీసాడు.

Story first published: Monday, August 24, 2026, 16:36 [IST]
Other articles published on Aug 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+