Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: ధోనీ రికార్డ్ బద్దలు కొట్టిన రిషభ్ పంత్.. తొలి వికెట్ కీపర్‌గా..!

టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో విదేశాల్లో, తటస్థ వేదికల్లో అత్యధిక పరుగులు చేసిన భారత తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా రిషభ్ పంత్ ఈ ఫీట్ సాధించాడు.

ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డ్‌ను పంత్ అధిగమించాడు. రిషభ్ పంత్ ఇప్పటి వరకు తటస్థ, అవే వేదికల్లో 41.68 సగటుతో 2500 పరుగులు చేశాడు. ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ 2496 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. ఫరోఖ్ ఇంజనీర్(1209), సయ్యద్ కిర్మాణి(1109), కిరణ్ మోరె(901) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

IND vs SL: వాడు ఏం అన్నాడో తెలియకపోతే మూసుకో.. హర్షా భోగ్లే‌పై జైస్వాల్ ఫైర్!

IND vs SL: వాడు ఏం అన్నాడో తెలియకపోతే మూసుకో.. హర్షా భోగ్లే‌పై జైస్వాల్ ఫైర్!

తొలి రోజు ఆటలో బంతి అతని ఎడమ చేతికి బలంగా తాకడంతో రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగిన రిషభ్ పంత్.. రెండో రోజు ఆటలో బరిలోకి దిగాడు. తనకే సాధ్యమైన బ్యాటింగ్‌తో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను కొట్టి భారీ సిక్సర్‌కు స్టేడియం పైకప్పుపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ బద్దలైంది. అదే జోరు కొనసాగించిన పంత్.. 81 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు.

Rishabh Pant Surpasses MS Dhoni to Create Historic Record in India vs Sri Lanka 2nd Test

హాఫ్ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన రిషభ్ పంత్‌ను కేశర నువాంత ఔట్ చేయడంతో ఏడో వికెట్‌కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రిషభ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్ సత్తా చాటడంతో ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి 131.2 ఓవర్లలో 8 వికెట్లకు 475 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్(95 బ్యాటింగ్), మహమ్మద్ సిరాజ్(0) ఉన్నాడు.

IND vs SL: రిషభ్ పంత్ భారీ సిక్సర్.. బద్దలైన సోలార్ ప్యానెల్!(వీడియో)

Also Read

IND vs SL: రిషభ్ పంత్ భారీ సిక్సర్.. బద్దలైన సోలార్ ప్యానెల్!(వీడియో)

దేవదత్ పడిక్కల్(193 బంతుల్లో 12 ఫోర్లతో 117) మరో శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(108 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. రవీంద్ర జడేజా(43), యశస్వి జైస్వాల్(45) తృటిలో హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు.

Story first published: Monday, August 24, 2026, 15:05 [IST]
Other articles published on Aug 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+