Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: వాడు ఏం అన్నాడో తెలియకపోతే మూసుకో.. హర్షా భోగ్లే‌పై జైస్వాల్ ఫైర్!

భారత ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేపై టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం జరిగిందో తెలుసుకోకుండా తీర్పులివ్వడం సరికాదని మండిపడ్డాడు. ఎవరైనా హద్దులు ధాటితే తప్పకుండా సమాధానం చెప్పాలని అభిప్రాయపడ్డాడు.

శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆ జట్టు పేసర్ అసిత ఫెర్నాండో, యశస్వి జైస్వాల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. యశస్వి జైస్వాల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన అసితా ఫెర్నాండో అత్యుత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను ఓ మాట అనడంతో ఆగ్రహానికి గురైన జైస్వాల్..ఫెర్నాండోపైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతని హెల్మెట్‌ ఫెర్నాండోకు తాకింది.

మౌనంగా వెళ్లిపోవాల్సింది..

ఈ ఘటనలో జైస్వాల్‌దే తప్పంటూ హర్షా భోగ్లే ఓ వెట్‌సైట్ షోలో తీర్పు ఇచ్చాడు. అసిత ఫెర్నాండో ఏమన్నా జైస్వాల్ మౌనంగా వెళ్లాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'వికెట్ తీసిన తర్వాత బౌలర్లు సెండాఫ్ ఇవ్వడమే అనవసరం. జైస్వాల్‌ను ఫెర్నాండో రెచ్చగొట్టాడు. కానీ జైస్వాల్ అతనిపైకి దూసుకెళ్లాల్సింది కాదు. మౌనంగా వెళ్లిపోయి ఉంటే మంచి స్పందన అయ్యేది. జైస్వాల్ అసాధారణ ప్రతిభ కలిగిన బ్యాటర్.

Yashasvi Jaiswal Hits Back at Harsha Bhogle Over Asitha Fernando Clash Don t Judge Without Knowing

కానీ అతని పోరాట స్వభావం కొన్నిసార్లు అతనిపైనే ఆధిపత్యం చెలాయిస్తుంది. జైస్వాల్ కూడా ఇతరులను రెచ్చగొడుతాడు. కాబట్టి ప్రత్యర్థుల స్లెడ్జింగ్‌ను కూడా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి. ఇలాంటి ఘటనలు తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని దెబ్బతియకుండా జైస్వాల్ చూసుకోవాలి.'అని హర్షా భోగ్లే వ్యాఖ్యానించాడు.

తెలియకపోతే తీర్పులు ఇవ్వొద్దు..

ఈ వ్యాఖ్యలపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన జైస్వాల్.. ఘాటుగా బదులిచ్చాడు. 'అతను ఏమన్నాడో మీకు తెలియకపోతే.. ఇలాంటి తీర్పులు ఇవ్వకుండా మౌనంగా ఉండండి. ఎవరైనా హద్దులు ధాటి ప్రవర్తిస్తే.. భారత్ తిరిగి పోరాడుతుందని, వాళ్లకు గట్టిగా బదులు ఇస్తుందని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.'అని జైస్వాల్ కామెంట్ చేశాడు.

మాట పడనప్పుడు..మీరు అనొద్దు..

మరో మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సైతం జైస్వాల్‌‌నే తప్పుబట్టాడు. క్రీడల్లో ఇది ఏ మాత్రం మంచిది కాదు. అత్యంత ప్రమాదకరం. గత మ్యాచ్‌లోనూ యశస్వి జైస్వాల్ ప్రత్యర్థి జట్టు బ్యాటర్ నిరోషన్ డిక్‌వెల్లా ఆడుతున్నప్పుడు స్లెడ్జింగ్‌తో రెచ్చగొట్టాడు. సరదాగానే మాట్లాడుతూ.. భారీ షాట్ ఆడేలా ఉసిగొల్పాడు.

అభ్యంతరకరమైన మాటలు లేనంతవరకూ ఇలాంటి స్లెడ్జింగ్ మంచిదే. రెండో టెస్ట్‌లోనూ అదే జరిగింది. కానీ, ఇక్కడ ప్రత్యర్థి తనను చూసి నవ్వినప్పుడు తట్టుకోలేకపోతే.. జైస్వాల్ కూడా ఇతరులను చూసి నవ్వకూడదు. ఇతరులు మిమ్మిల్ని అన్నప్పుడు తీసుకోలేకపోతే.. మీరు కూడా ప్రత్యర్థులను ఏమీ అనుకూడదు.'అని అజేయ జడేజా చురకలంటించాడు.

టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కోటక్ కూడా జైస్వాల్‌ది తప్పేనని అంగీకరించాడు. అయితే ఆటలో ఇవన్నీ సహజమేనని వ్యాఖ్యానించాడు. 'అక్కడ బౌలర్ ఏవో వ్యాఖ్యలు చేశాడు. అలాంటి ఉద్విగ్న పరిస్థితుల్లో ఇలా జరగడం సహజమే. అయితే, జైస్వాల్ కూడా మరీ దగ్గరగా వెళ్లకుండా ఉండాల్సింది.'అని సితాన్ష్ కొటక్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, August 24, 2026, 13:30 [IST]
Other articles published on Aug 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+