Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారి చేతగానితనంతోనే భువనేశ్వర్ కుమార్ అవకాశం: భారత మాజీ క్రికెటర్

యువ బౌలర్ల వైఫల్యంతోనే టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారని మాజీ క్రికెటర్, కోచ్ డబ్ల్యూవీ రామన్ అన్నారు. కుర్రాళ్లు రాణించి ఉంటే భువనేశ్వర్ అవసరం టీమిండియాకు ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.

కెరీర్ చివరి దశలో ఉన్న భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2022లో న్యూజిలాండ్‌పై చివరి మ్యాచ్ ఆడిన భువనేశ్వర్ కుమార్.. అదే జట్టుతో మళ్లీ పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున వరుసగా రెండు సీజన్లలో సత్తా చాటినా.. భువనేశ్వర్ కుమార్‌ను పట్టించుకోని సెలెక్టర్లు.. ఇటీవల భారత బౌలర్ల పేలవ ప్రదర్శన నేపథ్యంలో తిరిగి జట్టులోకి తీసుకున్నారు.

IND vs WI: అయ్యర్, గంభీర్‌కు కామన్‌సెన్స్ లేదు: అశ్విన్

IND vs WI: అయ్యర్, గంభీర్‌కు కామన్‌సెన్స్ లేదు: అశ్విన్

యువపేసర్లను సిద్దం చేయాలి..

ఐపీఎల్ 2026 సీజన్‌లో భువనేశ్వర్ కుమార్ 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు పడగొట్టి ఆర్‌సీబీ టైటిల్ నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా భువీ రీఎంట్రీపై మాట్లాడిన డబ్ల్యూవీ రామన్.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాడు. భువనేశ్వర్ కుమార్ పునరాగమనాన్ని స్వాగతిస్తూనే.. యువ పేసర్లను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు.

WV Raman Credits Inconsistent Young Bowlers for Bhuvneshwar Kumar s International Return

'భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనను అభినందించాల్సిందే. అతని పునరాగమనాన్ని కూడా స్వాగతించాలి. కానీ భువీ రీఎంట్రీ నేపథ్యంలో మరో కోణం కూడా చూడాలి. అతని అంతర్జాతీయ కెరీర్‌ ముగిసిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో పునరాగమనం చేశాడు. అంటే యువ పేసర్ల వైఫల్యంతోనే అతనికి అవకాశం దక్కిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

బౌలింగ్ కోచ్ స్పెషల్ ఫోకస్ పెట్టాలి..

పిచ్‌లు ఫ్లాట్‌గా.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. యువ బౌలర్లు ధారళంగా పరుగులివ్వడం ఆందోళన కలిగించే విషయం. రోహిత్, కోహ్లీ, అశ్విన్ వంటి ఆటగాళ్లు తప్పుకోవడంతో భారత జట్టులో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేవలం మ్యాచ్‌లు గెలవడంపైనే కాకుండా కుర్రాళ్లను సిద్దం చేయడంపై ఫోకస్ పెట్టాలి. ఇందుకోసం బౌలింగ్ కోచ్ అదనపు కృషి చేయాల్సిన అవసరం చాలా ఉంది.

IND vs WI: ఆఖరి టీ20లో భారత్ గెలవాలంటే అతన్ని జట్టులోకి తీసుకోవాలి: మాజీ క్రికెటర్

Also Read

IND vs WI: ఆఖరి టీ20లో భారత్ గెలవాలంటే అతన్ని జట్టులోకి తీసుకోవాలి: మాజీ క్రికెటర్

భారత్‌లో ప్రతిభకు కొదవలేదు. అద్భుతమైన వేగంతో బౌలింగ్ చేసే యువ ఫాస్ట్ బౌలర్లు ఎందరో ఉన్నారు. కానీ వారందరూ రొటేషన్ పద్దతిలో ఆడుతూ ధారళంగా పరుగులిస్తున్నారు. అంటే వాళ్ల విషయంలో ఏదో చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతుంది. ఆఫ్ సీజన్‌లో బౌలింగ్ కోచ్ వ్యక్తిగతంగా వారితో సమయం గడిపి, వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. అంతర్జాతీయ క్రికెట్‌లోని తీవ్రమైన ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని నేర్పినప్పుడే భారత బౌలింగ్ విభాగం మరింత బలపడుతుంది.'అని డబ్ల్యూవీ రామన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, October 16, 2026, 13:31 [IST]
Other articles published on Oct 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+