WTC 2027: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. ఆసీస్ అగ్రస్థానం గల్లంతు!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 సైకిల్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి తెరపడింది. సౌతాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన ఆసీస్.. డబ్ల్యూటీసీ 2027 పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. కేప్‌టౌన్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్ట్‌లో సౌతాఫ్రికా 176 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 288 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 111 పరుగులకే కుప్పకూలింది.
సౌతాఫ్రికా బౌలర్ సిమన్ హర్మర్(6/16) ఆరు వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించగా.. కగిసో రబడా(3/39) మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ఘోర పరాజయంతో ఆసీస్ డబ్ల్యూటీసీ 2027 పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి దిగజారింది. ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న సౌతాఫ్రికా రెండో స్థానానికి ఎగబాకింది. న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ సైకిల్‌లో ఆస్ట్రేలియా ఇదే తొలి సిరీస్ పరాజయం. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ 9 విజయాలు సాధించి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. 69.23 విన్నింగ్ పర్సంటేజీతో మూడో స్థానంలో కొనసాగుతోంది. 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన న్యూజిలాండ్ 4 విజయాలు ఒక ఓటమి, డ్రాతో 72.22 విజయాల శాతంతో అగ్రస్థానంలో నిలిచింది.
7 మ్యాచ్‌లే ఆడిన సౌతాఫ్రికా 5 విజయాలు 2 పరాజయలతో 71.43 విన్నింగ్ పర్సంటేజీతో రెండో స్థానంలో నిలిచింది. ఈ మూడో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా మూడో స్థానంలో ఉంది. కానీ ఈ విజయంతో ఇరు జట్ల స్థానాలు తారుమారయ్యాయి. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
భారత్ నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. 11 మ్యాచ్‌లు ఆడిన భారత్ 5 విజయాలు, 2 డ్రాలతో 51.52 విన్నింగ్ పర్సంటేజీతో 4వ స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ క్వీన్ స్వీప్ చేస్తే టాప్-2 ప్లేస్‌ను దక్కించుకోనుంది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్థాన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
సంక్షిప్త స్కోర్లు..
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 329 ఆలౌట్(మార్క్యూ అకెర్‌మన్ 95)
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 429 ఆలౌట్(జోష్ ఇంగ్లీస్ 102)
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 387 ఆలౌట్( ర్యాన్ రికెల్టన్ 101, వియాన్ మల్డర్ 115)
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 111 ఆలౌట్( సిమన్ హర్మర్ 6/16)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


