Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AUS: చరిత్ర సృష్టించిన కగిసో రబాడ.. వరల్డ్ రికార్డ్!

సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అత్యంత తక్కువ బంతుల్లో 350 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. 13,808 బంతుల్లోనే రబాడ 350 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో డేల్ స్టెయిన్ రికార్డ్‌ను రబాడ బద్దలుకొట్టాడు. స్టెయిన్ 14,719 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు.

మ్యాచ్‌ల పరంగా అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న నాలుగో బౌలర్‌గా మాల్కోమ్ మార్షల్‌తో సమంగా నిలిచాడు. ప్రస్తుతం రబాడ 75వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ జాబితాలో రిచర్డ్ హ్యాడ్లీ, డేల్ స్టెయిన్ 69 టెస్ట్‌ల్లో ఈ ఘనతను అందుకున్నారు. డెన్నిస్ లిల్లీ(70), గ్లెన్ మెక్‌గ్రాత్(74) తర్వాతి స్థానాల్లో ఉన్నాడు.

SA vs AUS: ర్యాన్ రికెల్టన్‌కు చేదు అనుభవం.. మీ అమ్మ సింగిల్ ఆ? అంటూ ప్లకార్డ్!(వీడియో)

SA vs AUS: ర్యాన్ రికెల్టన్‌కు చేదు అనుభవం.. మీ అమ్మ సింగిల్ ఆ? అంటూ ప్లకార్డ్!(వీడియో)

సౌతాఫ్రికా తరఫున 350 టెస్ట్ వికెట్ల ఘనతను అందుకున్న నాలుగో బౌలర్‌గా రబాడ నిలిచాడు. అతని కంటే ముందు డేల్ స్టెయిన్(93 టెస్ట్‌ల్లో 439), షాన్ పొలాక్(108 టెస్ట్‌ల్లో 421), ఎన్తిని(101 టెస్ట్‌ల్లో 390) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌‌గా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డ్ శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ పేరిట ఉంది. అతను 133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు తీసాడు.

SA vs AUS Kagiso Rabada Creates History Becomes Fastest Bowler to Take 350 Test Wickets

గెలుపు ముంగిట సౌతాఫ్రికా..

ఈ మూడో టెస్ట్‌లో సౌతాఫ్రికా గెలుపు ముంగిట నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగులు వెనుకంజలో నిలిచినా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పుంజుకుంది. 288 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 62 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ డ్రాతో గట్టెక్కాలంటే మరో 40 ఓవర్ల పాటు ఆడాలి. సౌతాఫ్రికాకు మాత్రం రెండు వికెట్లు కావాలి. క్రీజులో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(9 బ్యాటింగ్)తో పాటు నాథన్ లయన్(16 బ్యాటింగ్) ఉన్నారు. ఈ ఇద్దరూ ఇప్పటికే 12 ఓవర్లు ఆడారు.

100 పరుగుల లోటుతోనే..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. ఎయిడెన్ మార్క్‌రమ్(141 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 78), మార్క్యూ అకెర్‌మన్(94 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 95), డేవిడ్ బెడింగ్‌హమ్(80 బంతుల్లో 7 ఫోర్లతో 50), మార్కో జాన్సెన్(71 బంతుల్లో 7 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిచెల్ స్టార్క్(6/72) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించగా.. నాథన్ లయన్(2/71) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్‌ వుడ్, కూపర్ కనోల్లి చెరో వికెట్ తీసారు.

IND vs NZ: ఆదుకున్న ధ్రువ్ జురెల్.. భారత్-ఏ భారీ స్కోర్!

Also Read

IND vs NZ: ఆదుకున్న ధ్రువ్ జురెల్.. భారత్-ఏ భారీ స్కోర్!

అనంతరం ఆసీస్..429 పరుగులకు ఆలౌటైంది. జోష్ ఇంగ్లీస్(135 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102) సెంచరీతో రాణించగా.. అలెక్స్ క్యారీ(168 బంతుల్లో 7 ఫోర్లతో 80), ఓపెనర్ మాథ్యూ రేన్ షా(139 బంతుల్లో 10 ఫోర్లతో 74) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ మూడు వికెట్లు తీయగా.., సిమన్ హర్మర్ నాలుగు వికెట్లు పడగొట్టారు. కగిసో రబాడ, గెరాల్డ్ కోయిట్జీ, వియాన్ మల్డర్ తలో వికెట్ తీసారు. 100 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 387 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్(101), వియాన్ మల్డర్(115) సెంచరీలతో రాణించారు.

Story first published: Saturday, October 31, 2026, 18:26 [IST]
Other articles published on Oct 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+