Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AUS: హర్మర్ సిక్సర్.. ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా ఘన విజయం!

ఆస్ట్రేలియాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా 2-1తో కైవసం చేసుకుంది. కేప్‌టౌన్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్ట్‌లో సౌతాఫ్రికా 176 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 111 పరుగులకే కుప్పకూలింది.

సౌతాఫ్రికా బౌలర్ సిమన్ హర్మర్(6/16) ఆరు వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. కగిసో రబడా(3/39) మూడు వికెట్లతో సత్తా చాటాడు. నాథన్ లయన్(33 నాటౌట్), కామెరూన్ గ్రీన్(27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ సిరీస్ విజయంతో సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి దూసుకొచ్చింది. మరోవైపు ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని కోల్పోగా.. న్యూజిలాండ్ టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది.

SA vs AUS: ర్యాన్ రికెల్టన్‌కు చేదు అనుభవం.. మీ అమ్మ సింగిల్ ఆ? అంటూ ప్లకార్డ్!(వీడియో)

SA vs AUS: ర్యాన్ రికెల్టన్‌కు చేదు అనుభవం.. మీ అమ్మ సింగిల్ ఆ? అంటూ ప్లకార్డ్!(వీడియో)

100 పరుగుల లోటుతోనే..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. ఎయిడెన్ మార్క్‌రమ్(141 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 78), మార్క్యూ అకెర్‌మన్(94 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 95), డేవిడ్ బెడింగ్‌హమ్(80 బంతుల్లో 7 ఫోర్లతో 50), మార్కో జాన్సెన్(71 బంతుల్లో 7 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిచెల్ స్టార్క్(6/72) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించగా.. నాథన్ లయన్(2/71) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్‌ వుడ్, కూపర్ కనోల్లి చెరో వికెట్ తీసారు.

Simon Harmer s Six-Wicket Haul Powers South Africa to 176-Run Win Over Australia in 3rd Test

అనంతరం ఆసీస్..429 పరుగులకు ఆలౌటైంది. జోష్ ఇంగ్లీస్(135 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102) సెంచరీతో రాణించగా.. అలెక్స్ క్యారీ(168 బంతుల్లో 7 ఫోర్లతో 80), ఓపెనర్ మాథ్యూ రేన్ షా(139 బంతుల్లో 10 ఫోర్లతో 74) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ మూడు వికెట్లు తీయగా.., సిమన్ హర్మర్ నాలుగు వికెట్లు పడగొట్టారు.

కగిసో రబాడ, గెరాల్డ్ కోయిట్జీ, వియాన్ మల్డర్ తలో వికెట్ తీసారు. 100 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 387 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్(101), వియాన్ మల్డర్(115) సెంచరీలతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్ రెండేసి వికెట్లు పడగొట్టాడు.జోష్ హెజిల్ వుడ్‌కు ఒక వికెట్ దక్కింది.

SA vs AUS: చరిత్ర సృష్టించిన కగిసో రబాడ.. వరల్డ్ రికార్డ్!

Also Read

SA vs AUS: చరిత్ర సృష్టించిన కగిసో రబాడ.. వరల్డ్ రికార్డ్!

సంక్షిప్త స్కోర్లు..

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 329 ఆలౌట్(మార్క్యూ అకెర్‌మన్ 95)

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 429 ఆలౌట్(జోష్ ఇంగ్లీస్ 102)

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 387 ఆలౌట్( ర్యాన్ రికెల్టన్ 101, వియాన్ మల్డర్ 115)

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 111 ఆలౌట్( సిమన్ హర్మర్ 6/16)

Story first published: Saturday, October 31, 2026, 19:42 [IST]
Other articles published on Oct 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+