Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2027: ఐదు ఫ్రాంచైజీల రిటెన్షన్, రిలీజ్ జాబితా ఇదే!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2027 సీజన్ మినే వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించాయి. అక్టోబర్ 28న కొచ్చి వేదికగా డబ్ల్యూపీఎల్ 2027 వేలం జరగనుండగా.. రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించేందుకు బీసీసీఐ సెప్టెంబర్ 28 డెడ్‌లైన్‌గా పేర్కొంది. దాంతో ఐదు ఫ్రాంచైజీల రిటెన్షన్, రిలీజ్ జాబితాలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియో హాట్ ‌స్టార్ వేదికగా వెల్లడించారు.

మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. ఆశ్చర్యకరంగా స్టార్ ప్లేయర్ జీ కమలినిని విడుదల చేసింది. ఆసియా గేమ్స్‌లో గోల్డ్ గెలిచిన భారత జట్టు జీ కమలిని సభ్యురాలిగా ఉంది. డబ్ల్యూపీఎల్ 2025 సీజన్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన కమలిని ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. దాంతో కమలినితో పాటు సైకా ఇషాక్, త్రివేణి వశిష్టా, మిల్లీ లింగ్ వర్త్, క్రాంతి రెడ్డి, పూనమ్ ఖేమ్నర్‌లను విడుదల చేసింది.

Shree Charani: ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచిన తెలుగు తేజం!

Shree Charani: ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచిన తెలుగు తేజం!
WPL 2027 Mumbai Indians Release Asian Games Gold Medallist G Kamalini Check Full Retention and Release List of 5 Teams

ఢిల్లీ క్యాపిటల్స్ స్నేహ్ రాణాతో పాటు లిజిల్లే లీ, అలాన్ కింగ్‌ను వదిలేయగా.. గుజరాత్ జెయింట్స్ డాని వ్యాట్, ఆర్‌సీబీ గ్రేస్ హ్యారీస్, లిన్సే స్మిత్, దయాలన్ హేమలత, గౌతమి నాయక్‌లను రిలీజ్ చేసింది. యూపీ వారియర్స్.. డియాండ్ర డాటిన్, అమీ జోన్, చోలే ట్రయాన్, అశా శోభా, కిరణ్ నావిగిరే, శ్వేతా సెహ్రావత్‌లను వదులుకుంది. డబ్ల్యూపీఎల్ 2027 సీజన్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది.

డబ్ల్యూపీఎల్ 2027 రిటైన్, రిలీజ్ లిస్ట్..

1. ఢిల్లీ క్యాపిటల్స్

రిటైన్ లిస్ట్: జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, అన్నాబెల్ సదర్లాండ్, మారిజేన్ కాప్, లారా వోల్వార్డ్, చినెల్లే హెన్రీ, లూసీ హామిల్టన్, మిన్ను మణి, నికి ప్రసాద్, శ్రీ చరణి, మమతా మడివాల, నందిని శర్మ, దియా యాదవ్

రిలీజ్ లిస్ట్: స్నేహ్ రాణా, లిజెల్లీ లీ, అలానా కింగ్, తానియా భాటియా, ప్రగతి సింగ్, ఎడ్ల సృజన

2. గుజరాత్ జెయింట్స్

రిటైన్ లిస్ట్: బెత్ మూనీ, యాష్లీ గార్డనర్, సోఫీ డివైన్, జార్జియా వేర్హామ్, కిమ్ గార్త్, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా సింగ్, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, యస్తికా భాటియా, అనుష్క శర్మ, భారతి ఫుల్‌మాలి, కనికా అహూజా, హ్యాపీ కుమారి, జింటిమణి కలిత

రిలీజ్ లిస్ట్: డానీ వ్యాట్, ఆయుషి సోని, టిటాస్ సాధు, శివాణి సింగ్

ముంబై ఇండియన్స్ కోచ్‌గా ఆర్‌సీబీ టైటిల్ విన్నింగ్ కోచ్!

Also Read

ముంబై ఇండియన్స్ కోచ్‌గా ఆర్‌సీబీ టైటిల్ విన్నింగ్ కోచ్!

3. ముంబై ఇండియన్స్

రిటైన్ లిస్ట్: హర్మన్‌ప్రీత్ కౌర్, నాటాలీ సైవర్-బ్రంట్, అమేలియా కేర్, హేలీ మాథ్యూస్, నికోలా కేరీ, షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్, సజీవన్ సజనా, సంస్కృతి గుప్తా, రహీలా ఫిర్దోస్, వైష్ణవి శర్మ

రిలీజ్ లిస్ట్: జి కమలిని, సైకా ఇషాక్, త్రివేణి వసిష్ఠ, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, క్రాంతి రెడ్డి, పూనమ్ ఖేమ్నార్

4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)

రిటైన్ లిస్ట్: స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, జార్జియా వోల్, లారెన్ బెల్, నాడిన్ డి క్లర్క్, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్‌ఘరే, ప్రేమా రావత్, ప్రత్యూష కుమార్

రిలీజ్ లిస్ట్: గ్రేస్ హారిస్, లిన్సే స్మిత్, దయాళన్ హేమలత, గౌతమి నాయక్

5. యుపి వారియర్స్

రిటైన్ లిస్ట్: దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తారా నోరిస్, హర్లీన్ డియోల్, శిఖా పాండే, ప్రతికా రావల్, క్రాంతి గౌడ్, సిమ్రాన్ షేక్, షిప్రా గిరి

రిలీజ్ లిస్ట్: ఆశా శోభన, డియాండ్రా డాటిన్, కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్, అమీ జోన్స్, క్లోయ్ ట్రయాన్.

Story first published: Tuesday, September 29, 2026, 22:56 [IST]
Other articles published on Sep 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+