ముంబై ఇండియన్స్ కోచ్‌గా ఆర్‌సీబీ టైటిల్ విన్నింగ్ కోచ్!
ముంబై ఇండియన్స్ మహిళా టీమ్ కోచ్‌గా ల్యూక్ విలియమ్స్‌ను నియమించారు. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2027 సీజన్ నేపథ్యంలో ఈ నియామకం చేపట్టినట్లు ముంబై ఇండియన్స్ గురువారం ప్రకటించింది. గత సీజన్ వరకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన లీసా కీట్లీ స్థానంలో ల్యూక్ విలియమ్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఇప్పటి వరకు నాలుగు సీజన్లు జరగ్గా.. ముంబై ఇండియన్స్ రెండు సార్లు విజేతగా నిలిచింది. అరంగేట్ర డబ్ల్యూపీఎల్ 2023 సీజన్‌తో పాటు 2025లో టైటిల్ అందుకుంది. ఇప్పుడు అప్‌కమింగ్ డబ్ల్యూపీఎల్ 2027 సీజన్‌పై ఫోకస్ పెట్టింది. ల్యూక్ విలియమ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి 2024, 2025 సీజన్లలో హెడ్ కోచ్‌గా సేవలందించాడు. ఆ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. కొత్త కోచ్ నియామకంతో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు తదుపరి సీజన్ కోసం సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగనుంది.

లీసా కీట్లీ ముంబై హెడ్ కోచ్‌గా ఒక సీజన్ మాత్రమే పనిచేశారు. గత సీజన్‌లో ముంబై మహిళల టీమ్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఫ్రాంచైజీ అతన్ని తప్పించింది. అంతకుముందు కోచ్‌గా పనిచేసిన ఎడ్వర్డ్స్ ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత కీట్లీని నియమించగా.. అతని పర్యవేక్షణలో ముంబై ఇండియన్స్ గత సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, ఐదింటిలో ఓడింది.
ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ లీసా కీట్లీ సేవలకు కృతజ్ఞతలు తెలిపి, కొత్త కోచ్ ల్యూక్ విలియమ్స్‌కు స్వాగతం పలికారు., మహిళల క్రికెట్‌పై మంచి అవగాహనతో పాటు ఆటగాళ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టే అనుభవం ఆయనకు ఉందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. విలియమ్స్ మార్గదర్శకత్వం, హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో జట్టు మరింత ముందుకు సాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
డబ్ల్యూపీఎల్ 2027 సీజన్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 27 వరకు జరగనుంది. అక్టోబర్ 29న కొచ్చి వేదికగా డబ్ల్యూపీఎల్ 2027 వేలం జరిగే అవకాశం ఉంది. ఐదు ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించేందుకు సెప్టెంబర్ 28 డెడ్‌లైన్‌గా విధించారు. డబ్ల్యూపీఎల్ 2027 మ్యాచ్‌లకు కొత్త స్టేడియం వారణాసి ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


