WPL 2027 వేలం తర్వాత ఐదు జట్లు ఇవే!
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2027 సీజన్ మినీ వేలం ముగిసింది. బుధవారం కొచ్చి వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో మొత్తం 146 మంది క్రికెటర్లను వేలం వేయగా.. ఐదు ఫ్రాంచైజీలు 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందులో ఏడుగురు ఓవర్‌సీస్ ఆటగాళ్లు ఉండగా.. మరో 18 మంది భారత ప్లేయర్లు ఉన్నారు.
14 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లను ఐదు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినెక్స్ అత్యధిక ధర పలికింది. రూ.1.10 కోట్లకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల ఉమా కాశ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. డబ్యూపీఎల్ చరిత్రలోనే వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కురాలిగా ఉమా కాశ్వీ నిలిచింది. డబ్ల్యూపీఎల్ 2027 సీజన్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది.

మెగా వేలం తర్వాత ఐదు జట్ల పూర్తి వివరాలు..
1. ఢిల్లీ క్యాపిటల్స్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: కిరణ్ నవ్‌గిరే(రూ.75 లక్షలు), ఉమా కాశ్వీ(రూ.10 లక్షలు), కిర్‌స్టీ గోర్డన్(రూ.10 లక్షలు), నజ్మా ఖాన్(రూ.10 లక్షలు)
రిటైన్ లిస్ట్: జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, అన్నాబెల్ సదర్లాండ్, మారిజేన్ కాప్, లారా వోల్వార్డ్, చినెల్లే హెన్రీ, లూసీ హామిల్టన్, మిన్ను మణి, నికి ప్రసాద్, శ్రీ చరణి, మమతా మడివాల, నందిని శర్మ, దియా యాదవ్
2. గుజరాత్ జెయింట్స్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: జీ కమలిని(రూ.40 లక్షలు), ఓర్లా ప్రెండర్‌గాస్ట్(రూ.30 లక్షలు), సమైరా రాఘవ(రూ.10 లక్షలు)
రిటైన్ లిస్ట్: బెత్ మూనీ, యాష్లీ గార్డనర్, సోఫీ డివైన్, జార్జియా వేర్హామ్, కిమ్ గార్త్, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా సింగ్, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, యస్తికా భాటియా, అనుష్క శర్మ, భారతి ఫుల్‌మాలి, కనికా అహూజా, హ్యాపీ కుమారి, జింటిమణి కలిత
3. ముంబై ఇండియన్స్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: దిశా కసత్(రూ.10 లక్షలు), లతికా ఇనామ్‌దార్(రూ.10 లక్షలు), భార్తి రావల్(రూ.10 లక్షలు), సనికా చల్కే(రూ.10 లక్షలు), శ్వేత సెహ్రావత్(రూ.20 లక్షలు), అక్షిత భగత్(రూ.10 లక్షలు)
రిటైన్ లిస్ట్: హర్మన్‌ప్రీత్ కౌర్, నాటాలీ సైవర్-బ్రంట్, అమేలియా కేర్, హేలీ మాథ్యూస్, నికోలా కేరీ, షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్, సజీవన్ సజనా, సంస్కృతి గుప్తా, రహీలా ఫిర్దోస్, వైష్ణవి శర్మ
4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: జెస్ జొనాసెన్(రూ. 40 లక్షలు), క్లో ట్రయాన్(రూ.30 లక్షలు), తేజల్ హసబ్నిస్(రూ.30 లక్షలు), వ్రిందా దినేష్(రూ.10 లక్షలు).
రిటైన్ లిస్ట్: స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, జార్జియా వోల్, లారెన్ బెల్, నాడిన్ డి క్లర్క్, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్‌ఘరే, ప్రేమా రావత్, ప్రత్యూష కుమార్
5. యుపి వారియర్స్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: సోఫీ మోలినెక్స్(రూ.1.10 కోట్లు), స్నేహ్ రాణా(రూ.30 లక్షలు), గ్రేస్ హ్యారీస్(రూ.30 లక్షలు), సుష్మా వర్మ(రూ.10 లక్షలు), కాత్రిన్ బ్రైస్(రూ.10 లక్షలు), మనాలి దక్షిణి(రూ.10 లక్షలు), సహనా పవార్(రూ.10 లక్షలు), ఆశా శోభనా(రూ.30 లక్షలు).
రిటైన్ లిస్ట్: దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తారా నోరిస్, హర్లీన్ డియోల్, శిఖా పాండే, ప్రతికా రావల్, క్రాంతి గౌడ్, సిమ్రాన్ షేక్, షిప్రా గిరి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


