Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2027 మినీ వేలం.. భారీ ధర పలికిన ఆటగాళ్ల జాబితా ఇదే!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2027 సీజన్ మినీ వేలం‌లో పలువురు ప్లేయర్లు జాక్ పాట్ ధరను సొంతం చేసుకుంది. బుధవారం కొచ్చి వేదికగా జరిగిన ఈ మినీ వేలం‌లో మొత్తం 146 మంది క్రికెటర్లను వేలం వేయగా.. ఫ్రాంచైజీలు 25 మందిని కొనుగోలు చేశాయి. ఇందులో ఏడుగురు ఓవర్‌సీస్ ఆటగాళ్లు ఉండగా.. మరో 18 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. 14 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లను ఐదు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో కొంత మంది ఆటగాళ్లకు రికార్డ్ ధర దక్కింది. అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

1. సోఫీ మోలినెక్స్(రూ.1.10 కోట్లు)

ఆస్ట్రేలియా ప్లేయర్ సోఫీ మోలినెక్స్‌ రికార్డ్ ధర పలికింది. రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన సోఫీ మోలినెక్స్‌ను యూపీ వారియర్స్ రూ.1.10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ ఆస్ట్రేలియా కెప్టెన్‌ కోసం ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. దాంతో సోఫీ మోలినెక్స్ ధర అమాంతం పెరిగిపోయింది.

WPL 2027 Auction Full List of Top Buys as Sophie Molineux Commands 1 1 Crore
WPL 2027: నేడే అమ్మాయిల మినీ వేలం.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

WPL 2027: నేడే అమ్మాయిల మినీ వేలం.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

2. కిరణ్ నవ్‌గిరే(రూ.75 లక్షలు)

భారత పేసర్ కిరణ్ నవ్‌గిరేను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.75 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. 40 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలం బరిలో నిలిచిన కిరణ్ నవ్‌గిరే కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.75 లక్షలకు సొంతం చేసుకుంది.

3. జీ కమలిని, గ్రేస్ హ్యారీస్ (రూ.40 లక్షలు)

భారత వికెట్ కీపర్ జీ కమలినీని గుజరాత్ జెయింట్స్ రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది. గ్రేస్ హ్యారీస్‌ను యూపీ వారియర్స్ రూ.40 లక్షలకు తీసుకుంది. గ్రేస్ హ్యారీస్ కోసం ఆర్‌సీబీ మాత్రమే బిడ్ వేసింది. ఆస్ట్రేలియా ప్లేయర్ జెస్ జోనాసెన్‌ను ఆర్‌సీబీ రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది.

WPL 2027: ఐదు ఫ్రాంచైజీల రిటెన్షన్, రిలీజ్ జాబితా ఇదే!

Also Read

WPL 2027: ఐదు ఫ్రాంచైజీల రిటెన్షన్, రిలీజ్ జాబితా ఇదే!

4. స్నేహ్ రాణా, ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (రూ.30 లక్షలు)

భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణాను యూపీ వారియర్స్ ఆమె బేస్ ప్రైజ్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఐర్లాండ్ ప్లేయర్ ఓర్లా ప్రెండర్ గాస్ట్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. దాంతో డబ్ల్యూపీఎల్‌లో భాగమైన తొలి ఐర్లాండ్ ప్లేయర్‌గా ఓర్లా రికార్డ్ సాధించింది. భారత వికెట్ కీపర్ సుష్మా వర్మను యూపీ వారియర్స్ రూ.30 లక్షలకు తీసుకుంది.

Story first published: Wednesday, October 28, 2026, 19:45 [IST]
Other articles published on Oct 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+