Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2027: నేడే అమ్మాయిల మినీ వేలం.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

మహిళల వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2027 సీజన్ మినీ వేలానికి రంగం సిద్దమైంది. నేడు(బుధవారం) కొచ్చి వేదికగా ఈ అమ్మాయిల మినీ వేలం జరగనుంది. సాయంత్ర 5.30 గంటలకు మొదలవ్వనున్న ఈ వేలంలో మొత్తం 146 మంది క్రికెటర్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

ఇందులో 119 మంది భారత ప్లేయర్లు, 27 మంది ఓవర్‌సీస్ ఆటగాళ్లు ఉన్నారు. భారత్ నుంచి 97 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. 22 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు ఉన్నారు. ఐదు ఫ్రాంచైజీల్లో 27 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇందులో 7 ఓవర్ సీస్ స్లాట్స్ కాగా.. మరో 20 స్థానాల్లో భారత ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది.

ముంబై ఇండియన్స్‌లో ఓవర్‌సీస్ స్లాట్‌తో 8 స్థానాలు ఖాళీగా ఉండగా.. ఆర్‌సీబీలో 2 ఓవర్ సీస్ స్లాట్స్‌తో 7, ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఒక ఓవర్ సీస్ స్లాట్‌తో 6, యూపీ వారియర్స్‌లో 2 ఓవర్ సీస్ స్లాట్స్‌తో 9, గుజరాత్ జెయింట్స్‌లో ఒక ఓవర్ సీస్ స్లాట్‌తో పాటు నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

IND vs NZ: వారి సహకారంతోనే ఈ విధ్వంసకర సెంచరీ: అభిషేక్ శర్మ

IND vs NZ: వారి సహకారంతోనే ఈ విధ్వంసకర సెంచరీ: అభిషేక్ శర్మ
WPL 2027 Auction When And Where To Watch Live Team Purse Top Players Slots Remaining Live Streaming Telecast


యూపీ వద్దే ఎక్కువ డబ్బులు..

సరిగ్గా వేలానికి ముందు యూపీ వారియర్స్ నుంచి అమెరికా ప్లేయర్ తారా నోర్రిస్‌ను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది. దాంతో యూపీ వారియర్స్ వద్దే అత్యధిక పర్స్ వాల్యూ (3.75 కోట్లు) ఉంది. గుజరాత్ జెయింట్స్ రూ.1.25 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) రూ.1.15 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 1.10 కోట్లు, ముంబై ఇండియన్స్ 90 లక్షలతో వేలం బరిలోకి దిగుతున్నాయి.

భారత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కమలిని, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా, మిడిలార్డర్ బ్యాటర్ తేజల్, ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలనూ, ఇంగ్లండ్ ప్లేయర్ డంక్లీ, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్రేస్ హరీస్‌లకు మంచి ధర దక్కే అవకాశం ఉంది. అంతేకాకుండా గతేడాది మహిళల అండర్ 19 వన్డే టోర్నీలో మేఘాలయపై 157 బంతుల్లో 346 పరుగులు చేసిన 16 ఏళ్ల ముంబై బ్యాటర్ ఇరా జాధావ్ కూడా భారీ ధర పలికే ఛాన్స్ ఉంది.

IND vs NZ: ఆ ఇద్దరితో పాటు మంచు ముంచింది: మిచెల్ సాంట్నర్

Also Read

IND vs NZ: ఆ ఇద్దరితో పాటు మంచు ముంచింది: మిచెల్ సాంట్నర్

ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

డబ్ల్యూపీఎల్‌కు కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు జియో హాట్‌స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. జియో హాట్‌స్టార్‌లో ఈ మెగా వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత్, జింబాబ్వే రెండో వన్డే కూడా ఇదే సమయంలో జరగనుండటం గమనార్హం.

Story first published: Wednesday, October 28, 2026, 9:36 [IST]
Other articles published on Oct 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+