IND vs NZ: వారి సహకారంతోనే ఈ విధ్వంసకర సెంచరీ: అభిషేక్ శర్మ
కోచ్‌ల సహకారంతోనే విధ్వంసకర శతకం నమోదు చేయగలిగానని టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. తమ కోచ్‌లు నెట్స్‌లో సైడ్ ఆర్మ్ బంతులతో విపరీతంగా ప్రాక్టీస్ చేయించారని, అది తనకు బాగా ఉపయోగపడిందని చెప్పాడు. ఈ సెంచరీ వెనుక ఎంతో కఠోర శ్రమ ఉందని తెలిపాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అభిషేక్ శర్మ(38 బంతుల్లో9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 113) విధ్వంసకర శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
వైభవ్ మూమెంటమ్‌తో..
ఈ సందర్భంగా తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన అభిషేక్ శర్మ.. తన గురువు యువరాజ్ సింగ్ (12 బంతుల్లో 50) రికార్డ్ అందుకోవడం కష్టమని అభిప్రాయపడ్డాడు. పవర్ ప్లేలో మ్యాచ్‌ను ఆస్వాదించాలనుకున్నామని, అందుకు తగ్గట్లుగానే వైభవ్ మూమెంటమ్ అందించాడని చెప్పాడు.

'మా బ్యాటింగ్ ప్లాన్ చాలా సింపుల్. నేను, వైభవ్ పవర్ ప్లేలో మ్యాచ్‌ను ఆస్వాదించాలనుకున్నాం. ఫీల్డింగ్ చేసేటప్పుడే పిచ్ ఎలా ఉందనే విషయాన్ని గమనించాం. కొంచెం ఎక్స్‌ట్రా బౌన్స్ ఉండటంతో పాటు మైదానం చిన్నగా ఉండటంతో పవర్ ప్లేను, బౌలర్లను పేస్‌ను అనుకూలంగా వాడుకోవచ్చనే విషయం అర్థమైంది. అందుకు తగ్గట్లే ఆడాం. వైభవ్ తొలి ఓవర్‌ను ప్రారంభించిన తీరు చాలా ప్రత్యేకం. జట్టుకు మంచి మూమెంటమ్ అందించడమే మా ప్లాన్.
ఎంతో ప్రాక్టీస్ ఉంది..
ఇలా దూకుడుగా ఆడటం అంత ఈజీ కాదు. దీని వెనుక ఎంతో ప్రాక్టీస్ ఉంది. ముఖ్యంగా మా కోచ్‌ల సహకారం గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాలి. నెట్స్‌లో సైడ్ ఆర్మ్స్‌తో విపరీతంగా ప్రాక్టీస్ చేయించారు. గ్రౌండ్ సైజ్, కండిషన్స్‌తో పాటు బౌలర్లు ఎవరున్నారు అనేదాన్ని మనసులో ఊహించుకొని షాట్స్ ఆడించారు. నిన్న ప్రాక్టీస్ సెషన్ బాగా జరిగింది. దాన్ని మ్యాచ్‌లో ఉపయోగించుకోవాలనుకున్నా. అలాగే చేశాను. నిజం చెప్పాలంటే ఎలా ఆడాలని మనసులో అనుకున్నానో అలానే ఆడాను.
యువరాజ్ సింగ్ రికార్డ్‌ను అధిగమించడం కష్టం. ఆ రోజుల్లో యువరాజ్ సింగ్ ఎలా ఆడారో నాకైతే తెలియదు. కానీ ఆ రికార్డ్ అందుకోవడం అంత ఈజీ కాదు. ఏ బ్యాటర్ ఊరికే వెళ్లి 12 బంతుల్లో 50 పరుగులు కొట్టలేరు. అది ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతోంది. అయినా ఒక బ్యాటర్‌గా మేం అలాంటి రికార్డుల కోసం ఆడం. జట్టు విజయం కోసమే ఆడుతాం. ఈ సిరీస్ మొత్తం ఇదే అప్రోచ్‌తో ఆడాలనేది మా ప్లాన్. ఈ రోజు అది బాగా వర్కౌట్ అయ్యింది.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.
సిరీస్ భారత్ కైవసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫిన్ అలెన్(25 బంతుల్లో 5 సిక్స్‌లతో 40), బెవాన్ జాకబ్స్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మతో పాటు టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45) దూకుడుగా ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్(2/41) రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫిషర్, మిచెల్ సాంట్నర్ చెరో వికెట్ తీసారు. భారత ఓపెనర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. ఈ విజయంతో భారత్ ఐదు టీ20ల సిరీస్‌ను 3-0తో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


