Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మంగళగిరి వేదికగా ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026.. చీఫ్ గెస్ట్‌గా నారా బ్రాహ్మణి!

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 టోర్నీకి రంగం సిద్దమైంది. శనివారం మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే దిశగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఏసీఏ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో WAPL మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు!

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు!

WAPL 2026 సీజన్-1 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్ల మధ్య జరగనున్న ఆరంభ మ్యాచ్‌కు ఆమె హాజరై లీగ్‌ను ప్రారంభించనున్నారు.

Womens Andhra Premier League Begins September 19 With Nara Brahmani as Chief Guest

మహిళా క్రికెట్‌కు ప్రోత్సాహం కల్పించడం, రాష్ట్రంలోని ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారిణులకు మంచి వేదికను అందించడం WAPL ప్రధాన లక్ష్యం. ఇటీవలే మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని ఆదునీకరించారు. ఈ స్టేడియంలో WAPL నిర్వహించడం ద్వారా మంగళగిరి మరోసారి క్రీడా వేదికగా ప్రత్యేక గుర్తింపు పొందనుంది.

WAPL 2026 వేలం: శ్రీచరణికి తక్కువ ధరే.. భారీ ధర పలికిన ఆటగాళ్ల జాబితా ఇదే!

Also Read

WAPL 2026 వేలం: శ్రీచరణికి తక్కువ ధరే.. భారీ ధర పలికిన ఆటగాళ్ల జాబితా ఇదే!

ఈ లీగ్‌లో భాగంగా ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు మొత్తం 13 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రీడాభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించారు. మహిళా క్రికెట్ అభిమానులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై WAPL 2026 సీజన్-1ను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Story first published: Friday, September 18, 2026, 10:09 [IST]
Other articles published on Sep 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+