Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WAPL 2026 వేలం: శ్రీచరణికి తక్కువ ధరే.. భారీ ధర పలికిన ఆటగాళ్ల జాబితా ఇదే!

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలంలో భారత స్టార్ స్పిన్నర్, తెలుగు తేజం శ్రీచరణి అనూహ్యంగా తక్కువ ధరే పలికింది. రూ.1.10 లక్షలకు రాయలసీమ జట్టు ఆమెను సొంతం చేసుకుంది. లోకల్ ప్లేయర్‌ కావడంతో పాటు టీమిండియా స్టార్ స్పిన్నర్‌గా ఎదిగిన శ్రీచరణి భారీ ధర పలుకుతుందని అంతా అనుకున్నారు.

కానీ ఆమె లీగ్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ టోర్నీ జరగనున్న సమయంలో శ్రీచరణి టీమిండియా తరఫున ఆసియా కప్, ఆసియా గేమ్స్ ఆడనుంది. ఈ లీగ్ ఫస్ట్ ఫేజ్ మ్యాచ్‌లకు ఆమె దూరంగా ఉండనుంది.

ICC Rankings: వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌గా తెలుగమ్మాయి శ్రీచరణి

ICC Rankings: వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌గా తెలుగమ్మాయి శ్రీచరణి

ఏసీఏ ఆధ్వర్యంలో..

రాష్ట్రంలోని మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషనే.. వుమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ లీగ్‌లో తొలి అంకం ముగిసింది. మంగళవారం విజయవాడలో జరిగిన వేలానికి 191 మంది రిజిస్టర్ చేసుకోగా.. నాలుగు ఫ్రాంచైజీలు 75 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి.

WAPL 2026 Auction India Star Sree Charani Sold for Just Rs 1 10 Lakh to Rayalaseema Gen Stars

భారీ ధర పలికిన ఆటగాళ్లు..

ఆల్‌రౌండర్ హెర్నిటా ప్లవియా పెరీరాకు రికార్డ్ ధర లభించింది. ఆమెను రూ.4.30 లక్షలకు గోదావరి గోల్డెన్ ఈగల్స్ కొనుగోలు చేసింది. ఆమె తర్వాత అంజలి శర్వాణి(రూ.3.36 లక్షలు)ని వైజాగ్ ఫైర్‌బర్డ్స్ తీసుకుంది. ఆయేషా సింగ్(రూ.2.40 లక్షలు) కూడా వైజాగ్ ఫైర్ బర్డ్స్ కొనుగోలు చేసింది. అనూష(రూ.2.10 లక్షలు), దేవిక(రూ.2 లక్షలు)ను అమరావతి ఈ ఛాంపియన్స్ కొనుగోలు చేసింది. వేములపాటి సేతుసాయి(రూ.2.1 లక్షలు)ని రాయలసీమ జెన్‌స్టార్స్ తీసుకుంది.

కోహ్లీ, రోహిత్ కాదు.. అతనే నా ఫేవరేట్ క్రికెటర్: శ్రీచరణి

Also Read

కోహ్లీ, రోహిత్ కాదు.. అతనే నా ఫేవరేట్ క్రికెటర్: శ్రీచరణి

12 ఏళ్ల షణ్ముకకు అవకాశం..

డబ్ల్యూఏపీఎల్‌లో ఆడనున్న అతి పిన్న వయస్కురాలిగా 12 ఏ ళ్ల సాయి షణ్ముకప్రియ నిలిచింది. ఆమె కూడా రాయలసీమ జెన్‌స్టార్స్ తరఫున ఆడనుంది. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో సెప్టెంబర్ 15న డబ్ల్యూపీఎల్ మొదలవ్వనుంది. లీగ్ అంబాసిడర్ మిథాలీ రాజ్, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, ఏసీఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కళ్యాణ్ కృష్ణ తదితరులు ఈ వేలం ప్రక్రియలో భాగమయ్యారు.

వేలం తర్వాత పూర్తి జట్లు..

అమరావతి ఈ-ఛాంపియన్స్

నీరగట్టు అనూష (రూ. 2.10 లక్షలు), కండ్రేగుల దేవిక (రూ. 2.00 లక్షలు), కాట్రగడ్డ దీక్ష (రూ. 1.90 లక్షలు), షబ్నమ్ మహమ్మద్ షకీల్ (రూ. 1.30 లక్షలు), తరిణి జోషి (రూ. 1.20 లక్షలు), పారస రంగ లక్ష్మి (రూ. 1.00 లక్ష), కట్టా మహంతి శ్రీ (రూ. 0.85 లక్షలు), కె. హంస (రూ. 0.60 లక్షలు), అంకం విష్ణు ప్రియ (రూ. 0.60 లక్షలు), కె. హేమ సాయి రమ్య (రూ. 0.55 లక్షలు), కర్రి సాయి పూజిత (రూ. 0.50 లక్షలు), నక్కా సనా (రూ. 0.45 లక్షలు), ఓరుగంటి సాహితి శ్రీ (రూ. 0.40 లక్షలు), బోగియా సాయి దీప్తి (రూ. 0.30 లక్షలు), బొడ్డుపల్లి తనిష్క (రూ. 0.30 లక్షలు), తాళ్లూరి మల్లిక (రూ. 0.30 లక్షలు), ఎమ్. సహస్ర రెడ్డి (రూ. 0.30 లక్షలు), ఎమ్. రుక్సార్ తబస్సుమ్ (రూ. 0.30 లక్షలు)

గోదావరి గోల్డెన్ ఈగిల్స్

హెన్రియెట్టా ఫ్లావియా పెరేరా (రూ. 4.30 లక్షలు), కె. పుష్పిత గౌడ (రూ. 1.60 లక్షలు), వడ్డే అక్షయ (రూ. 1.40 లక్షలు), గుండుపల్లి విధుష (రూ. 1.10 లక్షలు), పేక విన్నీ సుజన్ (రూ. 1.10 లక్షలు), కొరుకొండ హారిక (రూ. 0.70 లక్షలు), బాతుల హర్షిత (రూ. 0.50 లక్షలు), సృష్టి శేఖర్ (రూ. 0.50 లక్షలు), ఎమ్. మహాలక్ష్మి మనోజ (రూ. 0.50 లక్షలు), చింతపల్లి మెహర్ లహరి (రూ. 0.50 లక్షలు), సాది అదితి మేఘన రెడ్డి (రూ. 0.40 లక్షలు), భాగం అంజన (రూ. 0.35 లక్షలు), టి. నివేదిత (రూ. 0.35 లక్షలు), కింతడ వైష్ణవి (రూ. 0.30 లక్షలు), పి. వనజాక్షి (రూ. 0.30 లక్షలు), సంగని దుర్గా భవాని (రూ. 0.30 లక్షలు), గామిడి రాఘ చౌదరి (రూ. 0.30 లక్షలు), పసగడుగుల వైష్ణవి (రూ. 0.30 లక్షలు)

రాయలసీమ జెన్ స్టార్స్

వేములపాటి సేతు సాయి (రూ. 2.10 లక్షలు), ఎల్లుట్ల పద్మజ (రూ. 2.00 లక్షలు), ఎమ్. గ్రీష్మ సాయి రెడ్డి (రూ. 1.20 లక్షలు), నల్లపురెడ్డి శ్రీ చరణి (రూ. 1.10 లక్షలు), కొక్కిలగడ్డ ధాత్రి (రూ. 1.00 లక్ష), కె. వాసవి అఖిల పవాని (రూ. 1.00 లక్ష), బండిరెడ్డి మల్లి అనూష (రూ. 0.90 లక్షలు), సజ్లా సాయి లక్ష్మి (రూ. 0.80 లక్షలు), ఆవుల చిన్న శిరీష (రూ. 0.65 లక్షలు), మలకొండ పూజిత (రూ. 0.60 లక్షలు), కొలత్తూర్ సుభాశ్రీ (రూ. 0.50 లక్షలు), వై. హేమ రోషిణి (రూ. 0.50 లక్షలు), గారపాటి లిఖిత (రూ. 0.50 లక్షలు), జె. మేఘన శ్రీ (రూ. 0.35 లక్షలు), జి. ముని నీతీష (రూ. 0.30 లక్షలు), అల్లుగుంటి హన్సి రెడ్డి (రూ. 0.30 లక్షలు), ఎ. షణ్ముఖ ప్రియ (రూ. 0.30 లక్షలు), జి. వర్ష (రూ. 0.30 లక్షలు), కె. హర్షిత గౌడ (రూ. 0.30 లక్షలు), దారా చైత్ర (రూ. 0.30 లక్షలు)

వైజాగ్ ఫైర్ బర్డ్స్

కె. అంజలి శర్వాణి (రూ. 3.60 లక్షలు), అయేషా సింగ్ (రూ. 2.40 లక్షలు), వీర విద్య శ్రీ (రూ. 1.50 లక్షలు), పల్నాటి రిషిక కృష్ణన్ (రూ. 1.20 లక్షలు), పెండ్యాల సరయ్ కోరు (రూ. 0.85 లక్షలు), వురుకుటి పుష్ప లత (రూ. 0.70 లక్షలు), ఎమ్. హుసిని చౌదరి (రూ. 0.70 లక్షలు), శరణ్య గద్వాల్ (రూ. 0.60 లక్షలు), బి.వి.ఎల్.ఎస్.ఆర్.ఎస్. సాయి తన్మయి (రూ. 0.50 లక్షలు), మయస్సర్ అంజుమ్ (రూ. 0.50 లక్షలు), పల్లా యుహాసిని (రూ. 0.35 లక్షలు), బి. మధుర సంజన ప్రియ (రూ. 0.30 లక్షలు), కొప్పుల దివ్య శ్రీ (రూ. 0.30 లక్షలు), దాసరి విశ్వశ్రీ (రూ. 0.30 లక్షలు), నక్ష్ సమ్మంత (రూ. 0.30 లక్షలు), ఎమ్. నియతి రాజ్ (రూ. 0.30 లక్షలు), కె. యశస్విని మణి వల్లి (రూ. 0.30 లక్షలు), కె.వై.ఎమ్. విష్ణు వర్ధిని (రూ. 0.30 లక్షలు)

Story first published: Wednesday, August 26, 2026, 9:19 [IST]
Other articles published on Aug 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+