Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ మూడో టీ20కి పోర్టబుల్ పిచ్.. ఇదేందయ్యా ఇది ఎక్కడా చూడలే!

న్యూజిలాండ్ పర్యటనలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా కీలక సమరానికి సిద్దమైంది. మంగళవారం వెల్లింగ్టన్ వేదికగా జరిగే మూడో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. బౌన్సీ పిచ్‌లపై న్యూజిలాండ్‌ను మట్టికరిపించి 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. సిరీస్‌పై కన్నేసింది. మూడో టీ20 గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది.

అయితే వెల్లింగన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ఉపయోగించే పిచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే క్రికెట్‌లో సాధారణంగా ఉపయోగించే నల్ల మట్టి, ఎర్ర మట్టి, మిక్స్‌డ్ మట్టితో చేసిన వికెట్ కాదు ఇది. ఈ మ్యాచ్‌కు వినూత్నమైన టెక్నాలజీతో రూపొందించిన పోర్టబుల్ పిచ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ పదం క్రికెట్ ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజన్ చేస్తోంది.

IND vs NZ: తప్పు సరిచేసుకోనున్న గంభీర్.. న్యూజిలాండ్‌తో మూడో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs NZ: తప్పు సరిచేసుకోనున్న గంభీర్.. న్యూజిలాండ్‌తో మూడో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
Why Did India vs New Zealand 3rd T20I Play on a Portable Pitch How Is It Prepared

పోర్టబుల్ పిచ్ ఏంటంటే..?

క్రికెట్ మైదానం బయట ఒక స్టీల్ ట్రేలో తయారు చేసిన పిచ్‌నే పోర్టబుల్ పిచ్ అంటారు. ఈ పిచ్‌ను మైదానం మధ్యలో ఫిక్స్ చేసి మ్యాచ్ ఆడిస్తారు. ఎందుకంటే వెల్లింగ్టన్ మైదానంలో కేవలం క్రికెట్ మాత్రమే ఆడరు. ఈ మైదానంలో క్రికెట్‌తో పాటు రగ్బీ, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతాయి. గత ఆదివారం(అక్టోబర్ 26) ఈ మైదానంలో రెండు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగాయి.

రోజు వ్యవధిలోనే ఈ మైదానంలో నేడు( మంగళవారం) భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 జరుగుతోంది. ఇంత తక్కువ సమయంలోనే మైదానంలో పిచ్‌ను సిద్దం చేయడం కష్టం కాబట్టే టెక్నాలజీ సాయంతో పోర్టబుల్ పిచ్‌ను రెడీ చేసి మ్యాచ్‌ల్లో ఉపయోగిస్తున్నారు. ఈ పిచ్‌పై యావరేజ్ స్కోర్ 170. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ స్టీల్ ట్రేను బయట పెట్టి ఇతర క్రీడలను ఆడిస్తారు. ఈ స్టీల్ ట్రే పిచ్‌ను పడేయకుండా రీ యూజ్ చేస్తారు. వాటరింగ్ చేస్తూ ఆ పిచ్‌ను మెయింటేన్ చేస్తారు. మళ్లీ మ్యాచ్‌కు అవసరమైనప్పుడు ఉపయోగిస్తారు.

IND vs NZ: టీమిండియా లక్కీగా గెలిచింది.. రేపు చూసుకుందాం: మైఖేల్ బ్రేస్‌వెల్

Also Read

IND vs NZ: టీమిండియా లక్కీగా గెలిచింది.. రేపు చూసుకుందాం: మైఖేల్ బ్రేస్‌వెల్

గాలికి కొట్టుకుపోయేది ఎవరో..?

ఈ మైదానంలో పిచ్ కంటే బలమైన గాలులను తట్టుకొని ఆడటమే ఆటగాళ్లకు అతిపెద్ద సవాల్. పిచ్‌ పేసర్లకు అడ్వాంటేజ్‌గా ఉంటుంది. ఈ మైదానంలో జరిగిన ఆఖరి టీ20లో మ్యాచ్ గెలిచిన జట్టు 164 పరుగులను డిఫెండ్ చేసుకుంది. అయితే ఒకసారి ఈ మైదానంలో 216 పరుగుల భారీ లక్ష్యం కూడా నమోదైంది. ఈ మైదానంలో న్యూజిలాండ్ గొప్ప రికార్డ్ లేదు. ఈ స్టేడియంలో జరిగిన గత ఏడు టీ20ల్లో న్యూజిలాండ్ రెండు మాత్రమే గెలిచింది.

Story first published: Tuesday, October 27, 2026, 12:04 [IST]
Other articles published on Oct 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+