Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: తప్పు సరిచేసుకోనున్న గంభీర్.. న్యూజిలాండ్‌తో మూడో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

న్యూజిలాండ్ పర్యటనలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం జరగనున్న మూడో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. తొలి రెండు టీ20ల తరహాలోనే ఈ మ్యాచ్ కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకోవాలని అయ్యర్ సేన భావిస్తోంది.

మరోవైపు సొంతగడ్డపై ఇజ్జత్ కాపాడుకోవాలనే పట్టుదలతో కివీస్ ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ రేసులో నిలవాలని ఆశిస్తోంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శనివారం జరిగిన రెండో టీ20 అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. ఆఖరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మూడో టీ20లో కూడా అదే తరహా ఫలితం రిపీట్ అయ్యే అవకాశం ఉంది.

IND vs NZ: గంభీర్ ఆ తప్పు చేస్తే.. ఆ ఇద్దరి ఆటగాళ్లు కెరీర్‌ నాశనమవుతోంది: మాజీ క్రికెటర్

IND vs NZ: గంభీర్ ఆ తప్పు చేస్తే.. ఆ ఇద్దరి ఆటగాళ్లు కెరీర్‌ నాశనమవుతోంది: మాజీ క్రికెటర్

ఇషాన్ ఔట్.. ఓపెనర్‌గా వైభవ్

గజ్జ గాయంతో రెండో టీ20 ఆడని ఇషాన్ కిషన్.. మూడో టీ20కి కూడా దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్నా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. దాంతో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగడం ఖాయమైంది. అయితే రెండో టీ20లో ఫస్ట్ డౌన్‌లో ఆడిన వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా నిరాశపర్చాడు.

IND vs NZ Vaibhav Sooryavanshi Likely to Open India May Play Without a Specialist Spinner in 3rd T20I

తన కెరీర్‌లోనే ఎప్పుడూ ఓపెనింగ్ స్లాట్ తప్పా మరో స్థానంలో ఆడని వైభవ్.. మూడో స్థానంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దాంతోనే వైభవ్‌ను తిరిగి ఓపెనింగ్ స్లాట్‌లో ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా రెండో టీ20లో చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని గంభీర్ భావిస్తున్నాడు. వైభవ్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే సంజూ, అభిషేక్‌లో ఒకరు ఫస్ట్ డౌన్‌లో ఆడనున్నారు.

కుల్దీప్, వరుణ్‌కు నో ఛాన్స్..

మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి మిడిలార్డర్‌లో ఆడనుండగా.. ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. వెల్లింగ్టన్‌ పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో టీమిండియా ఒకే ఒక స్పిన్నర్‌తో ఆడనుంది. అక్షర్ పటేల్‌కు తోడుగా నమన్ ధీర్ కొన్ని ఓవర్లు వేయనున్నాడు. ఈ క్రమంలోనే స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నారు.

IND vs ZIM: హర్మన్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ.. ఒక్క మాట మాట్లాడని స్మృతి మంధాన!

Also Read

IND vs ZIM: హర్మన్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ.. ఒక్క మాట మాట్లాడని స్మృతి మంధాన!

న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.

భారత టీ20 టీమ్

శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్.

Story first published: Monday, October 26, 2026, 16:44 [IST]
Other articles published on Oct 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+