IND vs NZ: టీమిండియా లక్కీగా గెలిచింది.. రేపు చూసుకుందాం: మైఖేల్ బ్రేస్‌వెల్
న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా దుమ్మురేపింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లను టీమిండియా లక్కీగా గెలిచిందని న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రెస్‌వెల్ అన్నాడు.
ఈ రెండు మ్యాచ్‌ల్లో తమ జట్టు తృటిలో విజయాలను చేజార్చుకుందని గుర్తు చేశాడు. వెల్లింగ్టన్ వేదికగా జరిగే మూడో టీ20లో టీమిండియాను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లో 225, 181 పరుగుల లక్ష్యాలను భారత్ అద్భుతంగా ఛేదించింది.
మూడో టీ20లో చూసుకుంటాం..
ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి అంచున నిలిచిన భారత్ అద్వితీయమైన ప్రదర్శనతో పుంజుకొని చిరస్మరణీయ విజయాలను అందుకొంది. వరుసగా రెండు టీ20ల్లో నమన్ ధీర్ కీలక పాత్ర పోషించగా.. రెండో మ్యాచ్‌లో తిలక్ వర్మ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు.

మంగళవారం ఇరు జట్ల మధ్య మూడో టీ20 జరగనుండగా.. సోమవారం మైఖేల్ బ్రేస్‌వెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ రేసులో నిలిచే ప్రయత్నం చేస్తామని చెప్పాడు. 'ఈ సిరీస్ ఇప్పటి వరకు చాలా ఉత్సాహభరితంగా సాగింది. మేం రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ, ఫలితాలు చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో మేం చేసిన తప్పులను సరిదిద్దుకొని, వెల్లింగ్టన్‌లో మెరుగ్గా రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఆ సిక్స్ క్యాచ్ అయ్యి ఉంటే..
అంతర్జాతీయ క్రికెట్‌లో వరల్డ్ బెస్ట్ టీమ్‌ను ఎదుర్కొన్నప్పుడు ఆటలోని అన్ని దశల్లోనూ అత్యుత్తమంగా రాణించాల్సి ఉంటుంది. మేం గత రెండు మ్యాచ్‌ల్లోనూ మెరుగ్గానే ఆడాం. కానీ ఈ మూడో టీ20లో పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను ముగించాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మనం బాగా రాణించిన అంశాలను మరికొంత కాలం పాటు కొనసాగించాలి.
టీ20 మ్యాచ్‌ల్లో గెలుపు ఓటములను నిర్ణయించే తేడాలు చాలా స్వల్పంగా ఉంటాయి. రెండో టీ20లో నేను వేసిన 14వ ఓవర్‌లో నమన్ ధీర్ కొట్టిన సిక్స్ మ్యాచ్ మూమెంటమ్‌ను మార్చింది. ఆ సిక్స్ బౌండరీ లైన్‌పై ఉన్న ఫీల్డర్ తల మీదుగా వెళ్లింది. అది కాస్త ముందుకు వెళ్లి ఉంటే వికెట్ పడేది.
గత రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కలిసొచ్చాయి. వారికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయి. ఈ సిరీస్‌లో నిలవాలంటే మూడో టీ20ని మేం గెలవాలి. ఈ సవాల్‌కు జట్టు మొత్తం సిద్దంగా ఉంది. ఎప్పుడెప్పుడు మ్యాచ్ ఆడుదామా? అనే ఉత్సాహంతో మా ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు.'అని మైఖేల్ బ్రేస్‌వెల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


