Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబ్ల్యూపీఎల్‌లోనూ 15 ఏళ్ల అమ్మాయి.. ఎవరీ ఉమా కాశ్వీ?

మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2027 వేలంలో సరికొత్త రికార్డ్ నమోదైంది. కర్ణాటకు చెందిన 15 ఏళ్ల అమ్మాయి ఉమా కాశ్వీ డబ్ల్యూపీఎల్ వేలం చరిత్రలోనే అమ్ముడైన అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కింది. పురుషుల క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడి సరికొత్త చరిత్రను లిఖిస్తే.. ఇప్పుడు ఉమా కాశ్వీ మహిళల క్రికెట్ ఆ రికార్డ్‌ను అందుకునేందుకు సిద్దమైంది.

బుధవారం కొచ్చి వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ 2027 వేలంలో ఉమా కాశ్విని ఢిల్లీ క్యాపిటల్స్ ఆమె కనీస ధర రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. 15 ఏళ్ల 202 రోజుల వయసులో ఉమా కాశ్వి ఈ ఘనతను అందుకుంది. గతేడాది హరియాణాకు చెందిన 16 ఏళ్ల దీయా యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయగా.. ఇప్పుడు ఆ రికార్డ్‌ను ఉమా కాశ్వీ బద్దలుకొట్టింది. రైట్ ఆర్మ స్పిన్నర్, రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఉమా కాశ్వీ.. వేలంలో ముందుగా అమ్ముడుపోలేదు. యాక్సిలరేటెడ్ రౌండ్‌లో ఆమెను ఢిల్లీ కొనుగోలు చేసింది.

అతను ఫ్లాట్ ట్రాక్ బుల్లీ కాదు.. వన్డే జట్టులోకి తీసుకోవాలి: మహమ్మద్ కైఫ్

అతను ఫ్లాట్ ట్రాక్ బుల్లీ కాదు.. వన్డే జట్టులోకి తీసుకోవాలి: మహమ్మద్ కైఫ్

ఎవరీ ఉమా కాశ్వీ

కర్ణాటకకు చెందిన ఉమా కాశ్వీ 2011 ఏప్రిల్ 9న జన్మించింది. 15 ఏళ్ల వయసులోనే భారత మహిళల అండర్ 19 జట్టు తరఫున ఆడి రికార్డ్ సాధించింది. వచ్చే ఏడాది బంగ్లాదేశ్, నేపాల్ వేదికగా జరిగే ఐసీసీ మహిళల అండర్ 19 ప్రపంచకప్ 2027 కూడా ఆమె ఆడే అవకాశం ఉంది. ఇటీవల శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఉమా కాశ్వీ.. ఇప్పటి వరకు రెండు యూత్ మహిళల వన్డేలు, మూడు యూత్ మహిళల టీ20లు ఆడింది. మూడు టీ20 మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు, రెండు వన్డే మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు తీసింది.

Who Is Uma Kashvi Meet the 15-Year-Old Who Became the Youngest Player Sold at WPL 2027 Auction

బీసీసీఐ నిర్వహించిన మహిళల అండర్-15 వన్డే టోర్నీలో మూడు సెంచరీలతో సహా 172 సగటుతో 516 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. కర్ణాటక అండర్-15 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(27 మార్చి 2011) పుట్టిన 12 రోజుల తర్వాత ఉమ జన్మించింది.

మామ త్యాగం..

ఉమా కాశ్వీని క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు ఆమె మేనమామ సాయి సత్య విజయ్ తన ఐటీ ఉద్యోగాన్ని కూడా వదిలేసారు. ఉమా కాశ్వీ డబ్ల్యూపీఎల్‌లో అమ్ముడు కావడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 'ఇది మా కలలు నిజమైన క్షణం. ఇన్నేళ్ల శ్రమకు దక్కిన ఫలితం'అని విజయ్ సంతోషం వ్యక్తం చేశాడు.

IND vs ZIM: ప్రతీకా,షెఫాలీ విధ్వంసం.. భారత్ ఘన విజయం!

Also Read

IND vs ZIM: ప్రతీకా,షెఫాలీ విధ్వంసం.. భారత్ ఘన విజయం!

జట్టు భవిష్యత్తు కోసమే ఉమా కాశ్వీని కొనుగోలు చేశామని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ జొనాథన్ బ్యాటీ తెలిపారు. 'ఉమా కాశ్వీ గత కొంతకాలంగా మా ప్రణాళికల్లో ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఒక దీర్ఘకాలిక పెట్టుబడిగా ఆమెను కొనుగోలు చేశాం. ఆమె భవిష్యత్తులో ఒక సూపర్ స్టార్ అవుతుందనే పూర్తి నమ్మకం మాకు ఉంది' అని జొనాథన్ బ్యాటీ చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, October 29, 2026, 11:06 [IST]
Other articles published on Oct 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+