IND vs ZIM: ప్రతీకా,షెఫాలీ విధ్వంసం.. భారత్ ఘన విజయం!
సొంతగడ్డపై జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. వడోదర వేదికగా బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 8 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ పర్యటనలో జింబాబ్వే ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోయింది. మూడు టీ20ల సిరీస్‌లో కూడా జింబాబ్వే క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే.
ఆఖరి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 39.5 ఓవర్లలో 131 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ మోడెస్టర్ ముపాచిక్వా(48 బంతుల్లో 7 ఫోర్లతో 37), కెప్టెన్ జోసెఫిన్ న్కోమో (67 బంతుల్లో 4 ఫోర్లతో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వైష్ణ వి శర్మ(5/39) ఐదు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించగా.. క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం భారత్ 17 ఓవర్లలో 2 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. ప్రతీకా రావల్(56 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్), షెఫాలీ వర్మ(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. జింబాబ్వే బౌలర్లలో నామ్‌వెలో సిబండా, లారిన్ ఫిరి తలో వికెట్ తీసారు.
సిక్సర్‌తో విజయం..
132 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా తమ ఓపెనర్‌గా యస్తికా భాటియాను పంపించగా.. ఆమె గోల్డెన్ డక్‌గావెనుదిరిగింది. ఫస్ట్ డౌన్‌లో హర్లిన్ డియోల్‌ను బ్యాటింగ్‌కు పంపించగా.. ప్రతీకా రావల్ ఆచితూచి ఆడింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. ఆచితూచి ఆడిన హర్లీన్ డియోల్(19) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది.
క్రీజులోకి వచ్చిన షెఫాలీ వర్మ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడింది. మరోవైపు ప్రతీకా రావల్ 47 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ప్రతీకా రావల్ నిదానంగా ఆడినా.. షెఫాలీ వర్మ టీ20 తరహా బ్యాటింగ్‌తో చెలరేగింది. విన్నింగ్ షాట్‌గా భారీ సిక్సర్ బాది 26 బంతుల్లో హాఫ్ సెంచరీతో పాటు టీమిండియా విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


