Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను ఫ్లాట్ ట్రాక్ బుల్లీ కాదు.. వన్డే జట్టులోకి తీసుకోవాలి: మహమ్మద్ కైఫ్

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అభిషేక్ తన బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడని కొనియాడాడు. అతన్ని ఫ్లాట్ ట్రాక్ బుల్లీ అని విమర్శించడం ఆపేయాలని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలడని చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ వన్డే జట్టులోకి కూడా తీసుకోవాలని సూచించాడు.

IND vs NZ: వైభవ్ సూర్యవంశీపై వేటు.. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs NZ: వైభవ్ సూర్యవంశీపై వేటు.. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 113 పరుగులు చేసి భారత్‌కు ఏకపక్ష విజయాన్ని అందించాడు. అతని ధాటికి ఈ మ్యాచ్‌లో 199 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 40 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ ఇన్నింగ్స్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన మహమ్మద్ కైఫ్.. అభిషేక్ శర్మ ఇంకా ఒకే ఫార్మాట్ ఆడటం తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పాడు.

IND vs NZ Mohammed Kaif Says Abhishek Sharma is not Flat track bully He Should Play In ODI Too

'అభిషేక్ శర్మను వన్డే టీమ్‌లోకి కూడా తీసుకోవాలి. వన్డే టీమ్‌లో ఇప్పటికే ఓపెనర్లు ఉండటంతో అతనికి అవకాశం దక్కలేదు. కానీ అతను కేవలం టీ20 ఫార్మాట్‌లోనే ఆడటం ఆశ్చర్యంగా ఉంది. మ్యాచ్‌పై అతని ప్రభావం అసాధారణమైనది. యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు జట్టుకు దూరమైనప్పుడు అభిషేక్ శర్మ విలువ తెలుస్తోంది. అభిషేక్ వన్డే అరంగేట్రం ఎంతో దూరంలో లేదు. అతి త్వరలోనే అతను వన్డే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. అభిషేక్ శర్మను ఫ్లాట్ ట్రాక్ బుల్లీ అని విమర్శించడం ఆపేయాలి.

IND vs ZIM: నిప్పులు చెరిగిన వైష్ణవి శర్మ.. 131 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే!

Also Read

IND vs ZIM: నిప్పులు చెరిగిన వైష్ణవి శర్మ.. 131 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే!

జపాన్, న్యూజిలాండ్ కండిషన్స్‌లోనూ అభిషేక్ సత్తా చాటాడు. ఆసియా కప్ ఫైనల్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. విభిన్నమైన పరిస్థితుల్లో రాణించగల సత్తా అభిషేక్‌కు ఉంది. న్యూజిలాండ్ ఏ మాత్రం బలహీనమైన జట్టు కాదు. అక్కడి వాతావరణం, పరిస్థితులకు తగ్గట్లు తన ఆటను మార్చుకొని అభిషేక్ అద్భుతంగా ఆడాడు. మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసంతోనే భారత్ 200 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. లేదంటే కష్టమయ్యేది.'అని మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Wednesday, October 28, 2026, 18:01 [IST]
Other articles published on Oct 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+