గంటకు 148 కిలోమీటర్ల వేగం.. 4 వికెట్లు.. 9 సిక్సర్లు! పాకిస్థాన్ క్రికెట్‌లో ఎవరీ తురుపు ముక్క!
ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 72 ఏళ్ల పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఓ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. అయితే ఈ సిరీస్ కోల్పోయినా.. ఆఖరి మ్యాచ్‌తో అసాధారణ ఆటగాడు వెలుగులోకి రావడం ఆ జట్టుకు అతిపెద్ద సానుకూలంశంగా మారింది. పాక్ పరాజయం కన్నా ఆ ఆటగాడి ప్రదర్శన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
నిలకడగా గంటకు 148 కిలోమీటర్ల వేగం.. అరంగేట్ర మ్యాచ్‌లోనే 4 వికెట్లు.. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన వికెట్‌పై 9 సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్ సదరు ఆటగాడిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. పాతాళానికి చేరిన పాకిస్థాన్ క్రికెట్‌లో తురుపు ముక్కలా అతని ప్రదర్శన ఆ దేశ అభిమానులకు ఆశలు రేకెత్తిస్తోంది. దాంతో యావత్ క్రికెట్ ప్రపంచం సదరు పాకిస్థాన్ యువ క్రికెటర్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతోంది.
క్రికెట్ నేపథ్యం లేకున్నా..
అతనెవరో కాదు.. 21 ఏళ్ల మీడియం ఫాస్ట్ బౌలర్, లోయరార్డర్ హిట్టర్ రజావుల్లా. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ యువ ఆల్‌రౌండర్ తొలి మ్యాచ్‌లో అద్వితీయమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి చెందిన మర్దాన్ జిల్లాలో జన్మించాడు. ఎలాంటి క్రికెట్ నేపథ్యం లేని సాధారణ కుటుంబ నుంచి వచ్చిన రజావుల్లా స్థానిక అండర్ 19 మ్యాచ్‌లు, నేషనల్ క్రికెట్ అకాడమీలోని బౌలింగ్ క్యాంప్ ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టులోకి రాగలిగాడు.

2023లో మార్దాన్ జిల్లా అండర్ 19 టోర్నీ ద్వారా క్రికెట్ కెరీర్ ప్రారంభించిన రజావుల్లా.. మెరుగైన ప్రదర్శనతో అబ్బోట్టాబాద్ రీజియన్ టీమ్‌లోకి వచ్చాడు. పాకిస్థాన్ దేశవాళీ టోర్నీ ప్రెసిడెంట్స్ ట్రోఫీలో సహీర్ అసోసియేషన్ జట్టు తరఫున 5 మ్యాచ్‌ల్లోనే 30 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.
మైక్ హెస్సన్ ప్రోత్సాహంతో..
క్వైదే ఆజామ్ ట్రోఫీలో పెషావర్ టీమ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి.. ఒకే మ్యాచ్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల అనుభవంతోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్ వైట్ బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ దృష్టిలో పడ్డాడు. పీఎస్‌ఎల్ 2026 సీజన్‌లో నయాటీమ్ రావల్పిండిజ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. నేషనల్ T20 కప్‌లో అబ్బోట్టాబాద్ ఫాల్కన్స్ జట్టుకు ఆడాడు.
తన తొలి అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో జో రూట్ వంటి దిగ్గజ బ్యాటర్ వికెట్‌తో సహా 4 వికెట్లు (4/148) పడగొట్టాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 63 బంతుల్లో 81 రన్స్ (4 ఫోర్లు, 9 సిక్సర్లు) సాధించాడు. అరంగేట్ర టెస్ట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదిన తొలి పాకిస్థాన్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
43 బంతుల్లోనే అతను ఈ ఫీట్ సాధించాడు. టెస్ట్ అరంగేట్ర ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (9 సిక్సర్లు) బాదిన బ్యాటర్‌గా న్యూజిలాండ్ దిగ్గజం టిమ్ సౌథీతో సమంగా నిలిచాడు. రజావుల్లా వేగం చూసి అభిమానులు పాకిస్థాన్ దిగ్గజం వకార్ యూనిస్‌ను గుర్తు చేసుకున్నారు. రజావుల్లా అద్వితీయమైన ప్రదర్శన ఫిదా అయిన ఇంగ్లండ్ అభిమానులు అతనికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


