Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుడ్డోడికి స్కెచ్ వేసాం.. వైభవ్ సూర్యవంశీకి అఫ్గాన్ కెప్టెన్ వార్నింగ్!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని అడ్డుకుంటామని అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్ అన్నాడు. 15 ఏళ్ల వైభవ్‌ను అడ్డుకునేందుకు ప్రణాళికలను సిద్దం చేశామని, అతని బ్యాటింగ్ వీడియోలను డీకోడ్ చేశామని చెప్పాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో అఫ్గానిస్థాన్ తొలి టీ20 ఆడనుంది. న్యూఢిల్లీ వేదికగా జరిగే ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది.

IND vs AFG: మళ్లీ ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: అఫ్గాన్ కెప్టెన్

IND vs AFG: మళ్లీ ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: అఫ్గాన్ కెప్టెన్

వైభవ్‌ను అడ్డుకుంటాం..

ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సిద్దమయ్యాయి. తొలి టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జడ్రాన్.. వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. 'వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రతిభావంతులు. అతను ఐపీఎల్‌లో చాలా బాగా ఆడాడు. అంతేకాకుండా వివిధ స్థాయిల పోటీల్లో రాణిస్తున్నాడు. మేం అతని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం.

Ibrahim Zadran Warns Vaibhav Sooryavanshi Ahead of IND vs AFG T20I Says Afghanistan Have Watched His Videos

ఐపీఎల్‌లో అతనికి వ్యతిరేకంగా ఆడిన మా ఆటగాళ్ల ద్వారా వైభవ్ గురించి తెలుసుకున్నాం. అతని బ్యాటింగ్ వీడియోలను పరిశీలించాం. అతన్ని ఔట్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్దం చేశాం.'అని జడ్రాన్ తెలిపాడు. అఫ్గానిస్థాన్ కెప్టెన్సీ బాధ్యతలను తాను ఆస్వాదించాలనుకుంటున్నాని తెలిపాడు.

కెప్టెన్సీ ఆస్వాదిస్తాను..

రషీద్ ఖాన్‌ అనంతరం అఫ్గాన్ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన జడ్రాన్.. మెరుగైన ఫలితాలు అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. 'కెప్టెన్సీ నాకు చాలా పెద్ద బాధ్యత. ఒక ఆటగాడిగా.. కెప్టెన్‌గా ఆస్వాదించడానికి, బాధ్యత తీసుకోవడానికి, ఒత్తిడి పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను.

మాకు ఢిల్లీ పరిస్థితుల గురించి బాగా తెలుసు. పరిస్థితికి అనుగుణంగా ప్రణాళికను అమలు చేయాలి. మేం నూటికి నూరు శాతం మా వంతు కృషి చేస్తూ.. ప్రక్రియ గురించి ఆలోచిస్తాం. ఈ సిరీస్‌లో మేం బాగా రాణిస్తామని ఆశిస్తున్నా.' అని ఇబ్రహీం జడ్రాన్ చెప్పుకొచ్చాడు.

భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ టీవీలో ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఫ్యాన్ కోడ్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. ఢిల్లీ మ్యాచ్‌కు భారీ అడ్డంకి!

Also Read

IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. ఢిల్లీ మ్యాచ్‌కు భారీ అడ్డంకి!

ఇరు జట్లు:

భారత్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.

ఆఫ్ఘనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నూర్ రెహ్మాన్ (వికెట్ కీపర్), సెడిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఉమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతి, నూర్ అహ్మద్, ముజీబుర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూకీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, నవీన్ ఉల్ హక్.

Story first published: Sunday, September 13, 2026, 13:35 [IST]
Other articles published on Sep 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+