Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. ఢిల్లీ మ్యాచ్‌కు భారీ అడ్డంకి!

IND vs AFG: శ్రీలంకపై టెస్ట్ సిరీస్ విజయం సాధించిన అనంతరం భారత క్రికెట్ జట్టు మళ్లీ టీ20 క్రికెట్‌పై దృష్టి సారించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో ఆదివారం(సెప్టెంబర్ 13) తొలి పోరుకు టీమిండియా సిద్ధమైంది. అయితే ఈ తొలి మ్యాచ్‌కు వర్షం భారీ అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

IND vs AFG: టీమిండియా ప్లేయింగ్-11లో బిగ్ ట్విస్ట్.. ఆ ఒక్క స్థానం కోసం ముగ్గురి మధ్య కొట్లాట!

IND vs AFG: టీమిండియా ప్లేయింగ్-11లో బిగ్ ట్విస్ట్.. ఆ ఒక్క స్థానం కోసం ముగ్గురి మధ్య కొట్లాట!

స్వదేశంలో వైభవ్ సూర్యవంశీ డ్రీమ్ డెబ్యూకి ఆటంకం?
ఈ సిరీస్‌లో అందరి దృష్టి 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. విదేశీ పర్యటనల్లో ఇంగ్లాండ్, జింబాబ్వేలపై మెరుపు ఇన్నింగ్స్‌లతో కేవలం 6 టీ20 మ్యాచ్‌ల్లోనే వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. జింబాబ్వేపై రెండు హాఫ్ సెంచరీలతో సహా 189కి పైగా స్ట్రైక్ రేట్‌తో 193 పరుగులు సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పటివరకు ఇండియాలో జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం వైభవ్ సూర్యవంశీకి లభించలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో తుది జట్టులో చోటు దక్కితే.. సొంత గడ్డపై తొలిసారి జెర్సీ ధరించి సత్తా చాటాలని ఆశిస్తున్న వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్ రద్దయితే పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.

India vs Afghanistan 1st T20 Rain Threat Casts Shadow Over Vaibhav Sooryavanshi Home Debut Details

ఆదివారం వర్ష సూచన
ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పరిసరాల్లో వర్షం కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆక్యూవెదర్ నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పటికే శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో తేలికపాటి వర్షం కురవడంతో స్టేడియం పరిస్థితులపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఆదివారం కూడా ఆకాశం మేఘావృతమై ఉండి జల్లులతో పాటు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.. ముఖ్యంగా మ్యాచ్ జరిగే సాయంత్రం సమయంలో వర్షం ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

IND vs AFG: జియోహాట్‌స్టార్, సోనీ లివ్ కాదు.. ఈ OTTలోనే లైవ్ మ్యాచ్!

Also Read

IND vs AFG: జియోహాట్‌స్టార్, సోనీ లివ్ కాదు.. ఈ OTTలోనే లైవ్ మ్యాచ్!

భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టీ20 రికార్డులు
టీ20 క్రికెట్ చరిత్రలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటివరకు 9 సార్లు తలపడగా.. టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2023 ఆసియా క్రీడల సందర్భంగా వర్షం కారణంగా రద్దయిన ఓ మ్యాచ్ మినహా మిగిలిన అన్నింటిలోనూ భారత్ విజయం సాధించింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో జరగబోయే మ్యాచ్ ద్వారా ఇండియాపై తమ రికార్డును మెరుగుపరచుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తుండగా.. మ్యాచ్ సజావుగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Story first published: Saturday, September 12, 2026, 18:10 [IST]
Other articles published on Sep 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+