Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

77 ఏళ్ల తర్వాత క్వాడ్రపుల్ సెంచరీ.. ఎవరీ చిన్మయ్ సుతార్!

భారత దేశవాళీ క్రికెటర్, మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో 77 ఏళ్ల తర్వాత క్వాడ్రపుల్ సెంచరీ(400 పరుగులు) నమోదు చేశాడు. రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో భాగంగా సోమవారం నాగాలాండ్‌తో జరుగుతున్న ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో చిన్మయ్ సుతార్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా రంజీ క్రికెట్ చరిత్రలోనే క్వాడ్రపుల్ సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.

సోవిమాలోని నాగాలాండ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చిన్మయ్ సుతార్ 46 ఫోర్లు, 7 సిక్సర్లతో బౌలర్లను ఊచకోత కోసాడు. తన కెరీర్‌లో రెండో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లోనే ఈ ఆల్‌టైమ్ రికార్డ్‌ను అందుకున్నాడు. మొత్తం 517 బంతుల్లో 400 పరుగులతో అజేయంగా నిలిచాడు.

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

రంజీ క్రికెట్ చరిత్రలోనే..

ఈ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో రంజీ ట్రోఫీ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పృథ్వీ షా పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించాడు. గతంలో పృథ్వీ షా 379 పరుగులు చేశాడు. ఈ జాబితాలో మహారాష్ట్ర మాజీ బ్యాటర్ నింబాల్కర్ 443 నాటౌట్ పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Who Is Chinmay Sutar Mizoram Batter Creates History With Unbeaten 400 in Ranji Trophy 2026-27

1948-48 సీజన్‌లో అతను ఈ ఫీట్ సాధించాడు. సుతార్ క్వాడ్రాపుల్ సెంచరీతో మిజోరం తమ తొలి ఇన్నింగ్స్ 581/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఓ దశలో మిజోరం 391 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగింది. కానీ చివరి బ్యాటర్ బ్యాటర్‌తో కలిసి చిన్మయ్ సుతార్ పోరాడాడు. ఆఖరి వికెట్‌కు అజేయంగా 190 పరుగులు జోడించారు.

దిగ్గజాల సరసన..

ఈ ఇన్నింగ్స్‌తో బ్రియన్ లారా (501 నాటౌట్), హనీఫ్ మహ్మద్ (499) డాన్ బ్రాడ్‌మన్ (452) వంటి క్రికెట్ దిగ్గజాల సరసన చిన్మయ్ సుతార్ నిలిచాడు. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 400కు పైగా పరుగులు చేసిన పదో బ్యాటర్‌గా అతను నిలిచాడు.

ఎవరీ చిన్మయ్ సుతార్..

ముంబైకి చెందిన చిన్మయ్ సుతార్.. గతంలో ఆ జట్టు తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ సీజన్‌కు ముందే ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్‌ఓసీ తీసుకొని మిజోరంకు మారాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే 35, 99 (రనౌట్) చిన్మయ్ సుతార్ ఆకట్టుకున్నాడు.

చిన్మయ్ సుతార్ తండ్రి రాజేష్ జనార్థన్ సుతార్ కూడా క్రికెటరే. అతను ముంబై తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. కుడిచేతి వాటం బ్యాటర్, కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్నర్‌ అయిన రాజేష్ సుతార్.. ముంబై తరఫున 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు.. 30 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 33.60 సగటుతో 168 పరుగులు చేసిన అతను.. ఐదు వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో రెండు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో సహా 753 పరుగులు, 26 వికెట్లు తీసాడు.

IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన

Also Read

IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన

ఎమర్జింగ్ టీమ్స్ కప్‌ ఆడిన సుతార్..

2019లో భారత్ తరఫున ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ కప్ కూడా సుతార్ ఆడాడు. ఆ టోర్నీలో భారత్.. సెమీఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో సుతార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 132 పరుగులు చేశాడు. హాంగ్ కాంగ్ టీమ్‌పై 85 బంతుల్లో 104 పరుగులతో సెంచరీ సాధించాడు.

Story first published: Monday, October 19, 2026, 19:49 [IST]
Other articles published on Oct 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+