Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: ఇవేం పిచ్‌లు రా అయ్యా..రోత పుడుతుంది!

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. శుక్రవారం రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

విపరీతమైన డ్యూ.. సిమెంట్ రోడ్డు‌లాంటి పిచ్‌ కారణంగా మైదానంలో సిక్సర్ల వర్షం కురిసింది. బౌలర్ లైన్ తప్పితే బంతి నేరుగా స్టాండ్‌లోకి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్ జరిగిన తీరుపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రోత పుడుతుంది రా అయ్యా..

సిమెంట్ రోడ్డు తరహా పిచ్‌లతో మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగుతున్నాయని, బౌలర్లకు రక్త కన్నీరే మిగులుతుందని మండిపడుతున్నారు. వన్డే సిరీస్‌తో సహా తొలి రెండు టీ20లు కూడా పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లు సిద్దం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Where Are the Bowlers Fans and Experts Slam Flat Pitches in India vs West Indies T20I Series

ఎవడు తొవ్వుకున్న గోతిలో వాడే పడ్డట్టు రెండో టీ20లో టీమిండియాకు దిమ్మతిరిగే షాక్ తగిలిందని కామెంట్ చేస్తున్నారు. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ఈ మ్యాచ్‌లను చూడాలంటే రోత పుడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

IND vs WI: సంజూ శాంసన్, తిలక్ వర్మ ఊచకోత.. కలిసొచ్చిన క్యాచ్ డ్రాప్!

IND vs WI: సంజూ శాంసన్, తిలక్ వర్మ ఊచకోత.. కలిసొచ్చిన క్యాచ్ డ్రాప్!

38.3 ఓవర్లలో 501 పరుగులు..

రెండో టీ20లో కేవలం 38.3 ఓవర్లలోనే 501 పరుగులు నమోదయ్యాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 249 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 252 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది.

పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లతో మ్యాచ్‌లు ఏకపక్షంగా ముగుస్తున్నాయి. బంతికి, బ్యాట్‌కు మధ్య పోటీనే లేకుండా పోయింది. డ్యూ ప్రభావం కారణంగా ఛేజింగ్ చేసే జట్లకే విజయవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఛేజింగ్ టీమ్స్‌కే విజయాలు దక్కాయి. తొలి రెండు వన్డేల్లో భారత్ ఛేజింగ్ చేయగా.. మూడో వన్డేలో వెస్టిండీస్ ఛేజింగ్ చేసి గెలిచింది.

IND vs WI: కొంపముంచిన మయాంక్ యాదవ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్!

Also Read

IND vs WI: కొంపముంచిన మయాంక్ యాదవ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్!

ఫ్లాట్ పిచ్‌లతో ఏం ఫాయిదా..?

ఫ్లాట్ పిచ్‌లతో జట్టుకు ఒరిగేది ఏం లేదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయినా పిచ్ క్యూరెటర్లు అతని మాటలను పట్టించుకోవడం లేదు. అసలే చిన్న గ్రౌండ్లు.. అందులోనా డ్యూ ప్రభావం.. ఫ్లాట్ పిచ్‌లతో బ్యాటర్లు చెలరేగతుండగా.. బౌలర్లకు మాత్రం ఏడుపు ఒక్కటే తక్కువ అవుతుంది.

స్వదేశీ ఫ్లాట్‌పిచ్‌లపై చెలరేగే భారత ఆటగాళ్లు విదేశీ వికెట్లపై తేలిపోతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో సంజూ, అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపర్చారు. పసికూన ఐర్లాండ్ చేతిలోనూ భారత్ ఖంగుతిన్నది. ఇక నుంచైనా బ్యాట్, బంతికి మధ్య పోటీ ఉండేలా పిచ్‌లు రెడీ చేయాలని నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు కోరుతున్నారు.

Story first published: Saturday, October 10, 2026, 12:22 [IST]
Other articles published on Oct 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+