Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: కొంపముంచిన మయాంక్ యాదవ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్!

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. చెత్త ఫీల్డింగ్‌, పేలవ బౌలింగ్‌తో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వెస్టిండీస్.. 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. కెప్టెన్ షైహోప్ విధ్వంసకర శతకంతో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించగా.. మయాంక్ యాదవ్ క్యాచ్ వదిలేయడం టీమిండియాకు నష్టం చేసింది.

IND vs WI: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. తొలి కెప్టెన్‌గా రికార్డ్!

IND vs WI: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. తొలి కెప్టెన్‌గా రికార్డ్!

249 పరుగులు చేసినా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగులు చేసింది.
సంజూ శాంసన్(41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), శ్రేయస్ అయ్యర్(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40 ), తిలక్ వర్మ(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47 నాటౌట్) దూకుడుగా ఆడారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్(3/24) మూడు వికెట్లు తీయగా.. షమార్ స్రింగర్(1/41) ఒక వికెట్ పడగొట్టారు.

Shai Hope Century Leads West Indies to Victory as Mayank Yadav s Dropped Catch Hurts India In 2nd T20I

శతక్కొట్టిన షై హోప్..

అనంతరం వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 252 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. షై హోప్(45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(37 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించాడు. రొమారియో షెఫెర్డ్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 నాటౌట్) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(3/36) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు.

కొంపముంచిన మయాంక్ యాదవ్..

250 పరుగుల భారీ లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. మయాంక్ యాదవ్ వేసిన తొలి ఓవర్‌లోనే కమిల్ పూరన్(4), షిమ్రాన్ హెట్‌మైర్(0) పెవిలియన్ చేరారు. దూకుడుగా ఆడిన రోవ్‌మన్ పోవెల్(24)ను కూడా మయాంక్ యాదవే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడ్డా మరోవైపు షై హోప్ దూకుడుగా ఆడాడు. దాంతో వెస్టిండీస్‌ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయినా 72 పరుగులు చేసింది.

ఈ క్రమంలో షై హోప్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు నిలకడగా ఆడుతున్న షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను షార్ట్ ఫైన్ లెగ్‌లో మయాంక్ యాదవ్‌ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే రూథర్‌ఫోర్డ్ 39 పరుగులకే వెనుదిరిగేవాడు. కానీ ఈ అవకాశంతో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

IND vs WI: సంజూ శాంసన్, తిలక్ వర్మ ఊచకోత.. కలిసొచ్చిన క్యాచ్ డ్రాప్!

Also Read

IND vs WI: సంజూ శాంసన్, తిలక్ వర్మ ఊచకోత.. కలిసొచ్చిన క్యాచ్ డ్రాప్!

24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. అతన్ని కుల్దీప్ యాదవే ఔట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. షై హోప్‌తో కలిసి రూథర్‌ఫోర్డ్ నాలుగో వికెట్‌కు 120 పరుగులు జోడించాడు. సెంచరీ ముంగిట రూథర్‌ఫోర్డ్ ఔటైనా.. రొమారియో షెఫెర్డ్‌తో కలిసి కెప్టెన్ షైహోప్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. విన్నింగ్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడంతో పాటు సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Story first published: Friday, October 9, 2026, 22:49 [IST]
Other articles published on Oct 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+