For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Happy Birthday Sachin Tendulkar: ఏడారిలో పరుగుల తుఫాన్ .. బర్తేడే రోజు ఆస్ట్రేలియాను మాములుగా ఆడుకోలేదు!

When Sachin Tendulkar sent Australia on a leather hunt to script famous win for India on his 25th birthday

హైదరాబాద్: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నేటి(ఏప్రిల్ 24)తో 48వ వసంతంలోకి అడుగుపెట్టాడు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఈ మాస్టర్ బ్లాస్టర్ ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.. మరెన్నో అద్భుతమైన విజయాలందించాడు. కానీ.. సరిగ్గా తన పుట్టిన రోజే ఈ భారతరత్నం చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన విధ్వంసకర సెంచరీతో ఆస్ట్రేలియాను గడగడలాడించాడు. ముఖ్యంగా ఆ దేశ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్‌కు చుక్కలు చూపించి ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఆ సూపర్ ఇన్నింగ్స్‌ను అభిమానులు సచిన్ బర్త్‌డే సందర్భంగా నెమరువేసుకుంటున్నారు. మాస్టర్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.

 సెంచరీ కొట్టి.. షార్జాకప్ ముద్దాడి..

సెంచరీ కొట్టి.. షార్జాకప్ ముద్దాడి..

సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 24, 1998)న దుబాయ్ వేదికగా జరిగిన కొకకోలా షార్జ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ట్రై సిరీస్ ఫైనల్లో సచిన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 131 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 134 పరుగులతో వీరవిహారం చేసిన మాస్టర్.. ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించాడు. అతని పోరాటం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు సచిన్ ఆ సిరీస్‌లో మొత్తం 434 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. అప్పట్లో తన సూపర్ బ్యాటింగ్‌ను కొనియాడుతూ క్రికెట్ విశ్లేషకులు 'ఏడారిలో సచిన్ తుఫాన్'అంటూ అభివర్ణించారు.

ఆ తప్పిదమే మా కొంపముంచింది: రోహిత్ శర్మ

 273 పరుగుల భారీ లక్ష్యం..

273 పరుగుల భారీ లక్ష్యం..

నాటి ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 272 పరుగులు చేసింది. స్టీవ్ వా (70), డారెన్ లెహ్‌మన్(70) టాప్ స్కోర్లర్లుగా నిలిచారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన భారత్.. సచిన్ సూపర్ సెంచరీతో 48.3 ఓవర్లలో 4 వికెట్లకు 275 పరుగులు చేసిన 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది.

షేన్‌వార్న్ ఉతికారేసిన సచిన్..

షేన్‌వార్న్ ఉతికారేసిన సచిన్..

ఓపెనర్‌గా బరిలోకి దిగిన సచిన్.. సౌరవ్ గంగూలీ (23), నయాన్ మోంగియా (28) నిరాశపరిచినా.. పట్టుదలగా క్రీజులో నిలిచాడు. అతన్ని నిలువరించేందుకు దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌ని పదే పదే కెప్టెన్ స్టీవ్‌వా ప్రయోగించగా.. స్వీప్ షాట్స్‌‌తో పాటు క్రీజు వెలుపలికి వచ్చి మరీ సచిన్ భారీ షాట్లు ఆడాడు. సచిన్ ధాటికి షేన్‌వార్న్ 10 ఓవర్లలో వికెట్ లేకుండా 61 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక సచిన్ 248 పరుగుల వద్ద ఔటవ్వగా.. అజారుద్దీన్(58), అజయ్ జడేజా(11 నాటౌట్), రుషికేష్(6 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశారు.

దేవన్నా.. ఆ శంకర్ గాడికి కొంచెం మంచి ఫుడ్ పెట్టు.. ఢిల్లీ‌తో హాఫ్ సెంచరీ కొట్టాలి నాయాల్ది!

 సచిన్ వల్లే ఫైనల్‌కు...

సచిన్ వల్లే ఫైనల్‌కు...

భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఈ షార్జా కప్ జరగ్గా.. ఒక్కో దేశం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడింది. అయితే భారత్, న్యూజిలాండ్ చెరొక విజయమే సాధించడంతో రన్ రేట్ కీలకమైంది. దీంతో ఆసీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ భారత్‌కు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. కానీ సచిన్ మెరుపు ఇన్నింగ్స్ వల్ల మెరుగైన రన్‌రేట్‌తో ఫైనల్‌కు చేరి కప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో సచిన్ 131 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులతో వీరవిహారం చేశాడు.

Story first published: Saturday, April 24, 2021, 9:03 [IST]
Other articles published on Apr 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+