
ఈ వీడియోలో ఏముందంటే..?
అయితే ఈ వీడియోలో టీమ్ ఆటగాళ్లంతా ఒక చోట భోజనం చేస్తూ ఎంజాయ్ చేశారు. సన్‌రైజర్స్ టీమ్ స్పెషల్ చెఫ్ దేవ్ ఆటగాళ్లందరికి మంచి ఫుడ్ వండిపెట్టారు. ఇండియన్ ఫుడ్‌తో పాటు అన్ని రకాల స్పెషల్ ఐటెమ్స్‌ను ఆటగాళ్లకు ప్రత్యేకంగా అందించాడు. ఇదే విషయాన్ని టీమ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ వీడియోలో వివరించాడు. అలాగే కొంతమంది ఆటగాళ్లు సైతం తాము ఏం తింటున్నామో తెలిపారు. ఖలీల్ అహ్మద్ మటన్ కర్రి గురించి చెప్పగా.. సిద్దార్థ్ కౌల్ మాత్రం అమ్మ అందించే ఫుడ్ ముందు ఏది పనికిరాదని, కానీ ఇది కూడా బాగానే ఉందని తెలిపాడు. చివర్లో విజయ్ శంకర్.. ఆహారం ఎంత ముఖ్యమో వివరిస్తూ.. సన్‌రైజర్స్ టీమ్ కల్చర్ తెలిపాడు.
ఆ శంకర్‌గాడికి మంచి ఫుడ్ పెట్టు..
ఈ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ 'అందరం కలిసే తింటాం.. అందరం కలిసే ఉంటాం'అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా.. అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ శంకర్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. విజయ్ శంకర్‌కు మంచి ఆహారం అందించాలని సన్‌రైజర్స్ చెఫ్ దేవ్‌కు సూచిస్తున్నారు. 'దేవన్నా.. కొంచెం ఆ శంకర్‌గాడికీ సాలిడ్ ఫుడ్ పెట్టు.. బ్యాటింగ్ చేయట్లే సరిగ్గా.. ఆదివారం ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో వాడు హాఫ్ సెంచరీ అయినా చేయాలి'అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
తిండి మీదున్న ఇంట్రెస్ట్..
ఇక తిండి మీదున్న ఇంట్రెస్ట్ కొంచెం మ్యాచ్ మీద పెట్టండ్రా అని మరికొంతమంది ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఇక సన్‌రైజర్స్ టీమ్ బ్యాటింగ్ పరంగా చాలా బలహీనంగా ఉంది. ఆ జట్టు ఓడిన మూడు మ్యాచ్‌లు కూడా సులువుగా గెలవాల్సినవే. కానీ మిడిలార్డర్ ఘోర వైఫల్యం జట్టును దెబ్బతీసింది. ముఖ్యంగా విజయ్ శంకర్ జట్టుకు కుదిబండగా మారాడు. బౌలింగ్‌లో వికెట్లు తీస్తున్నా.. బ్యాటింగ్‌లో ఓ సీనియర్ బ్యాట్స్‌మెన్‌గా బాధ్యత తీసుకోలేకపోతున్నాడు. అయినా అతనికి అవకాశాలివ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైతో మ్యాచ్‌లో పొలార్డ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను నేలపాలు చేసి జట్టు ఓటమికి కారణమయ్యాడు.


Click it and Unblock the Notifications












