ఐపీఎల్ రద్దయితే ధోనీ పరిస్థితేంటి?

ముంబై: 'ఐపీఎల్‌తో ధోనీ భవితవ్యం తేలనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో సత్తా చాటితే మహీ టీ20 ప్రపంచకప్ ఆడుతాడు'అని టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ గతంలో చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు కరోనా పుణ్యమా ఆ ఐపీఎలే రద్దయ్యేట్లుంది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జరగకపోతే ధోనీ పరిస్థితేంటి? ధోనీ మళ్లీ క్రికెట్ ఆడుతాడా? లేక తన కెరీర్‌కు గుడ్‌బై చెబుతాడా? రెండు రోజులుగా ధోనీ అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి.
అయితే వీటికి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సమాధానమిచ్చాడు. ఐపీఎల్ జరిగినా, జరగకపోయినా ధోనీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తే ప్రపంచకప్ జట్టులో ఉంటాడని తెలిపాడు.

ధోనీకి తెలుసు..
‘ధోనీ వంటి క్రికెటర్‌కు ఐపీఎల్ ఎప్పుడూ కీలకం కాదు. అతను ఐపీఎల్‌లో రాణిస్తే భారత జట్టులో ఎంపిక చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఏం చేస్తున్నాను అనేదానిపై ధోనీకి స్పష్టత ఉంది. రీఎంట్రీ ఇవ్వాలా? వద్దా? అనేది అతనికి తెలుసు.'అని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ చానెల్‌లో చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ వారధి కాదు..
ధోనీ జట్టులోకి రావడానికి ఐపీఎల్ ఏం వారధి కాదన్నాడు. ‘జట్టులోకి రావాలంటే ఐపీఎల్ అతడికి వారధి కాదు. ధోనీకి రావాలని ఉండి, సెలక్షన్‌కు అందుబాటులోకి వస్తే.. అతడిని ఎవరూ వదులుకోరు. ఎందుకంటే అపారమైన అనుభవం అతడి సొంతం. టీ20 ప్రపంచకప్‌లో అతడి అనుభవం కావాలనుకుంటే.. ఐపీఎల్ ఆడినా, ఆడకపోయినా ధోనీ జట్టులోకి వస్తాడు'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
కరోనా కన్ఫామ్ కాలేదు.. తప్పుడు ప్రచారాన్ని ఆపండి : అలెక్స్ హేల్స్

ప్రాక్టీస్ అదుర్స్..
ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ ఓటమి అనంతరం సుమారు 8 నెలలపాటు ధోనీ క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ.. ఈ సీజన్ కోసం నిర్వహించిన ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. తనదైన శైలిలో షాట్లు ప్రాక్టీస్ చేస్తూ అభిమానులను అలరించాడు. అతని ప్రాక్టీస్ చూసేందుకు అభిమానులు పోటెత్తారు. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2020 సీజన్ మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిఉండగా... దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. దీంతో ధోనీ చెన్నై నుంచి రాంచీకి తిరుగు పయనమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
నా బయోపిక్‌లో ఆ హీరోనే నటించాలి: యువరాజ్ సింగ్