For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు కరోనా వస్తే ఏం చేస్తారు.. బయో-బబుల్ స్ట్రాటజీపై ద్రవిడ్ సూటి ప్రశ్న!

What if a player tests positive on Day 2 of a Test? Rahul Dravid questions bio-bubble strategy

ముంబై: కరోనా వైరస్‌తో సావాసం చేస్తూ సురక్షితమైన వాతావారణంలో క్రికెట్ మ్యాచ్‌లు ఎలా నిర్వహించాలనే విషయంపై క్రికెట్ బోర్డులన్నీ మల్లగుల్లాలు పడుతున్నాయి. దీనికోసం బయో-బబుల్ స్ట్రాటజీ ఉపయోగించాలనుకుంటున్నాయి. ఓ రక్షణ వలయం సృష్టించిన బయో సెక్యూర్ ఎన్విరాన్‌మెంట్‌లో క్రికెట్‌ను పునరుద్దరించాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ వ్యూహం అమలు చేయడం చాలా కష్టమని భారత మాజీ క్రికెటర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.

అందరికీ సాధ్యమవ్వదు..

అందరికీ సాధ్యమవ్వదు..

పాకిస్థాన్‌, ‌వెస్టిండీస్ సిరీసులను బయో డబుల్ స్ట్రాటజీతో నిర్వహిస్తామని ఈసీబీ ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా వాల్ స్పందించాడు. ‘ఈసీబీ చెబుతున్నది అవాస్తవంగా అనిపిస్తోంది. చాలా రోజుల నుంచి సిరీసులేమీ జరగకపోవడంతో వారు అలా ఆలోచిస్తున్నారు. ఒకవేళ వారు ఒక రక్షణ వలయం (బబుల్‌) సృష్టించి నిర్వహించినా అది అందరికి సాధ్యమవ్వదు. ఎందుకంటే ఇప్పుడున్న షెడ్యూలు ప్రకారం ఆయా జట్లు నిరవధికంగా ప్రయాణాలు చేయాలి. ఎంతో మంది ప్రజలు ఇందులో భాగమవుతారు' అని ఓ వెబినార్‌లో ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

సాయం అందుకొని భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలా? అఫ్రిదిపై కనేరియా ఫైర్

రెండో రోజు పాజిటీవ్ వస్తే..

రెండో రోజు పాజిటీవ్ వస్తే..

పకడ్బందీగా పరీక్షలు, క్వారంటైన్ చేసి సురిక్షిత వాతావరణంలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించినా.. రెండో రోజు ఏ ఆటగాడికైనా కరోనా పాజిటివ్ వస్తే ఏం చేస్తారని ద్రవిడ్ ప్రశ్నించాడు. ‘పరీక్షలు, క్వారంటైన్‌ చేసి ఒకవేళ బయో బబుల్‌ సృష్టించినా టెస్టు మ్యాచు రెండో రోజు ఏ ఆటగాడికైనా పాజిటివ్‌ వస్తే ఏం చేస్తారు? ఇప్పుడున్న ప్రభుత్వ నిబంధనల ప్రకారమైతే మళ్లీ అందరినీ క్వారంటైన్‌లో ఉంచాల్సిందే. అప్పుడు టెస్టు మ్యాచ్ అర్ధాంతరంగా రద్దవుతుండటంతో మనం చేసిన ఖర్చులన్నీ వృథా అవుతాయి. ఒక ఆటగాడికి పాజిటివ్‌ వస్తే మొత్తం టోర్నీ రద్దవ్వకుండా ఏం చేయాలో ప్రభుత్వంతో కలిసి సమాలోచనలు చేయాలి'అని ద్రవిడ్‌ సూచించాడు.

పరిస్థితులకు అలవాటు పడాలి..

పరిస్థితులకు అలవాటు పడాలి..

'ప్రొఫెషనల్‌ స్థాయిల్లో క్రీడాకారులందరూ ప్రతీ దానికీ అలవాటు పడాలి. వారి ఆటపై ఇతర ప్రభావాలు పడనీయ వద్దు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత అనుభవం చాలా భిన్నంగా ఉంటుంది. అభిమానుల ముందు ఆడేందుకు ఆటగాళ్లు ఇష్టపడతారు. అది ఆటగాళ్లకు ఆత్మ సంతృప్తిని కలగజేస్తుంది. ఇప్పుడది కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. క్రీడాకారులుగా కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటాం. అన్నీ సవ్యంగా జరగవు. భయం, ఆందోళన కలుగుతాయి. అలాంటప్పుడు మనం నియంత్రించగలిగే వాటిపైనే దృష్టి సారించాలి' అని ద్రవిడ్‌ సూచించారు.

ఆ రోజు ధోనీకి బిర్యానీ వడ్డించి ఉంటే.. భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేవాడిని: మహ్మద్ కైఫ్

Story first published: Tuesday, May 26, 2020, 16:25 [IST]
Other articles published on May 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+