IND vs WI: హెట్‌మైర్ రీఎంట్రీ.. భారత్‌తో తలపడే వెస్టిండీస్ టీ20, వన్డే జట్లు ఇవే!
భారత పర్యటన కోసం వెస్టిండీస్ తమ జట్లను ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 18 వరకు జరగనున్న మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన వేర్వేరు జట్ల వివరాలను శనివారం వెల్లడించింది.
రెండు జట్లకు షైహోప్ సారథ్యం వహించనుండగా.. భారీ మార్పులు ఏం జరగేలేదు. గాయంతో దూరమైన జాన్ కాంప్‌బెల్ వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత విశ్రాంతి తీసుకున్న విధ్వంసకర బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మైర్ టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు.
సీపీఎల్ ప్రదర్శనతో..
సీపీఎల్ అద్వితీయమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ ఓపెనర్ కమిల్ పూరన్ తొలిసారి టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 8 ఇన్నింగ్స్‌ల్లో 159.64 స్ట్రైక్ రేట్ 39 సగటుతో 273 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో వెస్టిండీస్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు.
2028 టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో అతన్ని విండీస్ బోర్డు భాగం చేసింది. భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఆడిన క్వెంటిన్ సాంప్సన్ కూడా టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు.

ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. జట్టు దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని టీ20 జట్టును ఎంపిక చేశామని హెడ్ కోచ్ డారెన్ సామీ తెలిపారు. 'శ్రీలంకపై సిరీస్ విజయంతో వచ్చిన ఊపును కొనసాగించాలనుకుంటున్నాం. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ కోసం బలమైన జట్టును సిద్దం చేయడమే మా లక్ష్యం.
సొంతగడ్డపై ప్రపంచ ఛాంపియన్స్‌తో తలపడటం పెద్ద సవాల్. వ్యక్తిగతంగా, సమష్టిగా మెరుగుపడటానికి ఇదో మంచి అవకాశం.'అని సామీ చెప్పుకొచ్చాడు.
భారత పర్యటనకు వెస్టిండీస్ టీమ్స్..
వెస్టిండీస్ వన్డే టీమ్: షై హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, జాన్ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జంగూ, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, విటెల్ లావెస్, గుడకేష్ మోతీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్.
వెస్టిండీస్ టీ20 టీమ్: షై హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, కమిల్ పూరన్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ స్ప్రింగ్, రొమారియో సాంప్సన్, రొమారియో సాంప్సన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


