Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షూటింగ్‌లో గాయం.. భారత్‌తో టీ20 సిరీస్‌‌కు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ దూరం!

సొంతగడ్డపై భారత్‌‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఈ సిరీస్‌ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. తాజాగా ఆక్లాండ్‌లో జరిగిన ఓ ప్రమోషనల్ షూట్‌లో రచిన్ రవీంద్ర గాయపడ్డాడు. డైవ్ చేస్తూ క్యాచ్ పట్టే సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో ఈ గాయమైనట్లు తెలుస్తోంది. అతను కుడి భుజం డిస్‌లోకేట్ అయిందని, భారత్‌తో టీ20 సిరీస్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

శుక్రవారం నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో రచిన్ రవీంద్ర ఎముకలు, కండరాలకు పెద్ద గాయాలేమి కాలేదని నిర్దారణ అయింది. అయితే తగిన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అతని రిహాబిలిటేషన్‌పైనే రీఎంట్రీ ఆధారపడి ఉంది.

Rachin Ravindra Doubtful for India T20Is After Shoulder Dislocation During Promo Shoot

అతని గాయం.. దురదృష్టం..

రచిన్ రవీంద్ర గాయంపై న్యూజిలాండ్ టీమ్ ఆపరేషన్స్ మేనేజర్ మైక్ శాండిల్ విచారం వ్యక్తం చేశాడు. 'రచిన్ అలా గాయపడటం మాకు చాలా బాధ కలిగించింది. అతను త్వరగా కోలుకుని.. వీలైనంత త్వరగా మైదానంలోకి వచ్చేలా చేయడమే మా మొదటి ప్రాధాన్యత.

మా ఆటగాళ్లతో చేసే ప్రమోషనల్, కమర్షియల్ షూటింగ్‌లు అన్నీ ముందస్తు అనుమతితో.. తగిన భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే జరుగుతాయి. ఇది ఒక దురదృష్టకర ఘటన. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మా నియమాలు, భద్రతా చర్యలను మరిన్ని జాగ్రత్తలతో సమీక్షించుకుంటాం.'అని మైక్ శాండిల్ మీడియాకు తెలిపారు.

తొందర పెట్టం..

రచిన్ రవీంద్ర గాయంపై న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. భవిష్యత్తు టెస్ట్ ప్రణాళికల నేపథ్యంలో అతనికి తగిన విశ్రాంతి ఇస్తామని తెలిపాడు. 'రాబోయే రోజుల్లో రచిన్ రవీంద్ర ఆడాల్సిన టెస్ట్‌ మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. కాబట్టి అతని గాయం విషయంలో మేం చాలా అప్రమత్తంగా ఉంటాం. రాబోయే ఆరు నెలల్లో టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు ఎక్కువగా ఉన్నందున.. రచిన్‌ను తొందరపెట్టి మైదానంలోకి తీసుకురాం. అతను త్వరలోనే పూర్తిగా కోలుకొని జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని ఆశిస్తున్నా.'అని రాబ్ వాల్టర్ చెప్పుకొచ్చాడు.

ఆ ఇద్దరితో టీమిండియాకు ప్రమాదం: ప్రముఖ జ్యోతిష్యుడు

Also Read

ఆ ఇద్దరితో టీమిండియాకు ప్రమాదం: ప్రముఖ జ్యోతిష్యుడు

అక్టోబర్ 22 నుంచి సొంతగడ్డపై భారత్‌తో న్యూజిలాండ్ ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 1 నుంచి ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌ల్లో బరిలోకి దిగనుంది. టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా అక్టోబర్ 24 నుంచి నవంబర్ 10 వరకు భారత్-ఏ జట్టు మూడు నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.

Story first published: Saturday, September 19, 2026, 14:39 [IST]
Other articles published on Sep 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+