Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: వన్డేల్లోకి ఆ ముంబై ఆటగాడా? ఏం చూసి ఎంపిక చేశారు?: హనుమ విహారి

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ నమన్ ధీర్ తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే అప్‌కమింగ్ మూడు వన్డేల సిరీస్‌‌కు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 27 నుంచి ఈ సిరీస్ మొదలవ్వనుంది. ఓవైపు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత వన్డే టీమ్ ఈ సిరీస్ ఆడుతుండగానే.. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 టీమ్‌ ఆసియా గేమ్స్‌ బరిలోకి దిగనుంది. దాంతో వన్డే జట్టులో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కింది.

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఆసియా గేమ్స్‌ కోసం జపాన్ వెళ్లనున్నారు. రియాన్ పరాగ్, హర్ష్ దూబే వంటి ద్వితీయ శ్రేణి ఆల్‌రౌండర్లు గాయపడ్డారు. దాంతో రవీంద్ర జడేజా సుదీర్ఘ విరామం తర్వాత వన్డే జట్టులోకి రాగా.. నమన్ ధీర్ తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. నమన్ ధీర్ దూకుడుగా ఆడటంతో పాటు బౌలింగ్ కూడా చేయగలడు.

Hanuma Vihari Questions Naman Dhir s Selection for West Indies ODI Series Says It Is Shocking

ఆశ్చర్యంగా అనిపించింది..

అయితే ఈ ఎంపికపై వెటరన్ బ్యాటర్ హనుమ విహారి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఏ లెక్కన నమన్ ధీర్‌ను ఎంపిక చేశారని ప్రశ్నించాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన హనుమ విహారి నమన్ ధీర్ ఎంపికకు ఆసక్తికర కారణాన్ని వెల్లడించాడు. 'వెస్టిండీస్‌తో సిరీస్.. ఆసియా గేమ్స్ ఒకే సారి జరుగుతుండటంతో భారత వన్డే జట్టులో చాలా మార్పులు చేశారు. కానీ నమన్ ధీర్‌ను ఏ లెక్కన ఎంపిక చేశారో అర్థం కావడం లేదు.

డొమెస్టిక్ క్రికెట్‌లో అతనికి గొప్ప రికార్డులు ఏం లేవు. పంజాబ్ లీగ్‌లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ తరఫున కూడా కొన్ని మ్యాచ్‌లు గెలిపించాడు. కానీ అతను ఎప్పుడూ నిలకడగా ఆడలేదు. ఈ సెలెక్షన్ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నాకైతే చాలా సందేహాలు ఉన్నాయి.

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

Also Read

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

బహుషా బౌలింగ్ చేస్తాడనే

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలడనే ఏకైక కారణంతోనే నమన్ ధీర్‌ను ఎంపిక చేసి ఉంటారు. ప్రస్తుతం ఉన్న వన్డే టీమ్‌లో టాప్-6 బ్యాటర్లలో ఎవరూ కూడా బౌలింగ్ చేయరు. కోహ్లీ, రోహిత్, శ్రేయస్ అయ్యర్ ఇలా ఎవరూ బౌలింగ్ చేయలేరు. జడేజా తిరిగి వచ్చినప్పటికీ.. టాప్-6లో బౌలింగ్ చేసే వారు లేరు. బహుషా ఈ కారణంతోనే నమన్ ధీర్‌ను జట్టులోకి తీసుకొని 2027 వన్డే ప్రపంచకప్‌‌కు సిద్దం చేయాలని భావిస్తున్నట్లున్నారు.

Story first published: Saturday, September 19, 2026, 15:13 [IST]
Other articles published on Sep 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+