జహీర్ ఖాన్‌ను వదులుకొని లక్నో తప్పు చేసింది.. సీఎస్‌కేది గొప్ప నిర్ణయం: మాజీ క్రికెటర్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను ఎంపిక చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సంతోషం వ్యక్తం చేశాడు. భారత ఆటగాడు హెడ్ కోచ్ కావడం ఆనందంగా ఉందన్న జాఫర్.. జహీర్ ఖాన్‌ను లక్నో సూపర్ జెయింట్స్(LSG) వదులుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.
డ్రెస్సింగ్ రూమ్‌ను ప్రశాంతంగా ఉంచుతూ.. ఆటగాళ్ల మనస్తతత్వాన్ని అర్థం చేసుకునే అసాధారణమైన ప్రతిభ జహీర్ ఖాన్ సొంతమని, సీఎస్కేకు అతను సరైన మార్గదర్శిగా నిలుస్తాడని అభిప్రాయపడ్డాడు. 18 ఏళ్ల పాటు సీఎస్‌కేకు హెడ్ కోచ్‌గా సేవలందించిన స్టీఫెన్ ఫ్లేమింగ్.. ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా వెళ్లిపోవడంతో ఈ మార్పు అనివార్యమైంది.
భారత క్రికెట్‌కు కలిసొచ్చే అంశం..
ఈ నియామకంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన వసీం జాఫర్.. సీఎస్‌కే సరైన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డాడు. 'జహీర్ ఖాన్ సీఎస్కే హెడ్ కోచ్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. టీమిండియా మాజీ ఆటగాళ్లు కోచ్‌లుగా మారడం భారత క్రికెట్‌కు కలిసొచ్చే అంశం.
జహీర్ ఖాన్‌కు ఆటపై చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఆటగాళ్ల మైండ్‌సెట్‌ను అతను అద్భుతంగా అర్థం చేసుకోగలడు. కాబట్టి ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి అతను హెడ్ కోచ్‌గా రావడం నన్ను ఏమాత్రం ఆశ్చర్యపరచలేదు.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

లక్నో వదులుకోవడంపై ఆశ్చర్యం!
గతంలో ముంబై ఇండియన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మెంటార్‌గా వ్యవహరించిన జహీర్ ఖాన్‌ను ఎల్‌ఎస్‌జీ ఏడాది వ్యవధిలోనే వదులుకోవడంపై వసీం జాఫర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'నిజం చెప్పాలంటే లక్నో కేవలం ఒక్క ఏడాదిలోనే జహీర్‌ను ఎందుకు పక్కన పెట్టిందో అర్థం కావడం లేదు.
లక్నో జట్టులో అతని పనితీరు బాగుంది. ఎలాంటి పరిస్థితులనైనా ప్రశాంతంగా హ్యాండిల్ చేయడంలో జహీర్ ఖాన్ దిట్ట. హెడ్ కోచ్‌గానే కాకుండా భవిష్యత్తులో బౌలింగ్ కోచ్‌గా కూడా అతను ఏ జట్టుకైనా పెద్ద అసెట్ కానున్నాడు.'అని వసీం జాఫర్ విశ్లేషించాడు.
జహీర్‌కు సవాలే..
ఐపీఎల్ 2023 సీజన్‌లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేదు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ కూడా జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో సీఎస్‌కేకు పూర్వ వైభవం తీసుకురావడం జహీర్ ఖాన్ ముందున్న అతిపెద్ద సవాలే. ఏడాది కాలానికే హెడ్ కోచ్‌గా ఒప్పందం కుదుర్చుకున్న జహీర్ ఖాన్.. మినీ వేలానికి ముందు ఆటగాళ్ల ఎంపిక , రిటైన్షన్స్, రిలీజ్ వంటి ప్రణాళికల్లో కీలక పాత్ర పోషించనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


