IND vs AFG: ఆ ఇద్దరూ ఏం తప్పు చేశారు.. ఎందుకు తప్పించారు: మాజీ క్రికెటర్
అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ ప్రాతిపాదికన జట్టును ఎంపిక చేస్తున్నారో.. ఆటగాళ్లను ఎందుకు తప్పిస్తున్నారో సెలెక్టర్లకే తెలియాలని అసహనం వ్యక్తం చేశాడు. రింకూ సింగ్‌తో పాటు వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడాన్ని వసీం జాఫర్ తప్పుబట్టాడు.
అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ రీఎంట్రీ ఇవ్వగా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లిన రింకూ సింగ్, హర్ష్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్‌లను సెలెక్టర్లు తప్పించారు.

ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. గాయాలతో జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలు కూడా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ నలుగురు ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసుకోవాల్సి ఉంది.
రింకూ సింగ్ ఏం పాపం చేశాడు..
ఈ జట్టుపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించిన వసీం జాఫర్.. రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్‌లను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. ఈ ఇద్దర్ని తప్పించడం బాధకు గురి చేసిందన్నాడు. 'రింకూ సింగ్ ఐపీఎల్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లోనూ సత్తా చాటాడు. రెడ్‌బాల్ ఫార్మాట్ అయిన దులీప్ ట్రోఫీలోనూ సత్తా చాటాడు. కానీ దురదృష్టవశాత్తు అతనికి టీమిండియాలో చోటు దక్కలేదు. అతన్ని సెలెక్టర్లు ఎందుకు తప్పించారో వారికే తెలియాలి.
జట్టులో రీఎంట్రీ ఇచ్చిన వారి కోసం రింకూను పక్కనపెట్టారా? జట్టులో చోటు కోల్పోయేంతగా అతను ఎలాంటి తప్పూ చేయలేదు. తనకు అవకాశం ఇచ్చిన ప్రతీసారి సత్తా చాటాడు. కఠినమైన పరిస్థితుల్లోనూ రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతని ప్రదర్శన బాగానే ఉన్నా జట్టు నుంచి తప్పించారు.
కుల్దీప్‌కు అన్యాయమే..
కుల్దీప్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతీసారి అతనికి అన్యాయమే జరుగుతోంది. అతటి పట్ల సెలెక్టర్లు ఎందుకు సుముఖంగా లేరో అర్థం కావడం లేదు.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ తరఫున 295 పరుగులు చేసిన రింకూ సింగ్.. యూపీ టీ20 లీగ్‌లో 6 ఇన్నింగ్స్‌లు ఆడి 169 పరుగులు సాధించాడు. దులిప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరఫున ఓ హాఫ్ సెంచరీతో 80 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ భారత్ తరఫున 54 టీ20లు ఆడి 95 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో అతను చివరి మ్యాచ్ ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

